వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పట్టాలు తప్పిన అమరావతి ఎక్స్‌ప్రెస్: వారంలో రెండో రైలు ప్రమాదం

|
Google Oneindia TeluguNews

పనాజీ: రైలు ప్రమాదం సంభవించింది. అమరావతి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. రైలు ప్రమాదం సంభవించడం వారం రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. అస్సాంలోని గౌహతి నుంచి రాజస్థాన్‌లోని బికనేర్ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ ఈ నెల 13వ తేదీన పశ్చిమ బెంగాల్‌లోని అలీపూర్ దౌర్ డివిజన్ పరిధిలోని న్యూదొమోహని-న్యూ మైనాగురి వద్ద పట్టాలు తప్పింది. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రయాణికులు మరణించారు. 36 మంది గాయపడ్డారు.

ఈ ఘటన చోటు చేసుకున్న సరిగ్గా అయిదో రోజు మరో రైలు దుర్ఘటన సంభవించింది. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా-గోవా సమీపంలోని వాస్కో డా గామా మధ్య నడిచే అమరావతి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. గోవా-కర్ణాటక సరిహద్దుల్లోని దూధ్ సాగర్ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం తప్పింది. ప్రయాణికులు కూడా ఎవ్వరూ రైల్వే అధికారులు వెల్లడించారు. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు.

Howrah bound Amaravati express derailed near Goa all passengers and staff on board are safe

పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జంక్షన్-వాస్కో డ గామా మధ్య రాకపోకలు సాగించే ఈ ఎక్స్‌ప్రెస్.. అమరావతి ఎక్స్‌ప్రెస్ ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మీదుగా ప్రయాణిస్తుంది. శ్రీకాకుళం జిల్లాలోని పలాస మొదలుకుని, అనంతపురం జిల్లా గుంతకల్లు జంక్షన్ వరకూ పలు స్టేషన్లలో ఈ ఎక్స్‌ప్రెస్ హాల్ట్ సౌకర్యం ఉంది. హౌరా నుంచి బయలుదేరిన ఈ రైలు ఈ ఉదయం 8:56 నిమిషాలకు కరన్‌జోల్- దూధ్ సాగర్ స్టేషన్ల మధ్య పట్టాలు తప్పింది.

దూధ్ సాగర్ స్టేషన్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. ఇంజిన్ ఫ్రంట్ వీల్స్.. పట్టాల మీది నుంచి నేలలోకి దిగబడ్డాయి. పెద్ద శబ్దం చేస్తూ రైలు ఒక్కసారిగా ఆగిపోయింది. కుదుపులకు లోనైంది. పట్టాల మీద పెద్ద బండరాళ్లు జారిపడటం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు అంచనా వేస్తోన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదని తెలిపారు. సమాచారం అందిన వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి, ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేశారు.

English summary
A Howrah-bound express train derailed on Tuesday morning near Goa's Dudhsagar. As per latest reports, all passengers and staff on board are safe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X