భారతీయ రైల్వేలో లెజెండ్... కోరమాండల్ ఎక్స్ ప్రెస్
భారతీయ రైల్వేలో రాజధాని, శతాబ్ది, వందే భారత్, దురంతో లాంటి రైళ్లు ఇప్పుడు వచ్చాయికానీ 46 సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టిన సూపర్ ఫాస్ట్ రైలు అంటే కోరమాండల్ ఎక్స్ ప్రెస్ అని అర్థం. ఈ పేరు చెబితేనే రైల్వే భావోద్వేగానికి గురవుతుంది. దేశంలో అత్యధిక వేగంతో తీసుకొచ్చిన మొదటి రైలుగా దీనికి పేరుపడింది.చెన్నై నుంచి హౌరాకు నడిచే ఈ రైలు వేగం గంటకు 130 కిలోమీటర్లు. నాలుగు రాష్ట్రాలమీదగా 25 గంటల్లో 1661 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. కోరమాండల్ అంటే అందరికీ ఠక్కున గుర్తుకువచ్చేది దాని వేగం మాత్రమే.
46 సంవత్సరాల నుంచి ఈ రైలు నిరంతరాయంగా నడుస్తోంది. ప్రారంభంలో వారానికి రెండురోజులు మాత్రమే నడిచేది. తర్వాత ప్రయాణికుల నుంచి రోజురోజుకు డిమాండ్ ఎక్కువవడంతో రోజువారీ ప్రవేశపెట్టారు. గతంలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైన సంఘటనలు జరిగాయికానీ తాజాగా ఒడిసాలోని బాలేశ్వర్ వద్ద జరిగిన ప్రమాదం మాత్రం అతి పెద్దతి. ఇప్పటివరకు ఎన్నో లక్షల మందిని తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చిన కోరమాండల్ ప్రమాదానికి గురికావడంతో ప్రయాణికులంతా దాని చరిత్రను, వేగాన్ని మరోసారి గుర్తుచేసుకుంటున్నారు.

కోరమాండల్ వస్తోంది అంటేనే ఆ లైన్ లో వెళ్లే మిగతా రైళ్లన్నింటినీ ఆపేస్తారు. హై ప్రయారిటీ కింద శరవేగంతో దూసుకుపోతుంది. ఏపీ, తమిళనాడు, ఒడిసా, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రజలకు ఈ రైలుతో ఉన్న అనుబంధం వీడదీయరానిది. ఆ అనుబంధంతోటే కోరమాండల్ ను రైల్వే లెజెండ్ గా పిలుస్తుంటారు. ఉదయం చెన్నైలో బయలుదేరితే విజయవాడ, ఏలూరు, తాడేపల్లి గూడెం, రాజమండ్రి, విశాఖపట్నంలోనే ఆగుతుంది. మధ్యలో ఒంగోలులో ఆగినప్పటికీ టికెట్లు ఇవ్వరు. ఆహారం కోసం, టెక్నికల్ గా చెకింగ్ కోసం అక్కడ ఆగుతుంది. తర్వాత ఒడిసాలో 7 చోట్ల, బెంగాల్ లో 2 చోట్ల మాత్రమే ఆగుతుంది. తన గమ్యస్థానాన్ని 25 గంటల్లో చేరుకుంటుంది.












Click it and Unblock the Notifications