వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీడియాలోను 'మి టూ' ప్రకంపనలు: ఉద్యోగినిలకు వేధింపు, పెద్ద తలకాయల రాజీనామా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 'మి టూ' ఉద్యమం ఇప్పుడు భారత దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తమపై లైంగిక వేధింపులు జరిగాయంటూ పలువురు మహిళలు బయటకు వస్తున్నారు. గతంలో తమపై జరిగిన లైంగిక వేధింపులు, లైంగిక దాడులపై అంతర్జాతీయంగా 'మి టూ' ఉద్యమం ప్రారంభమైంది. దేశంలోను ఇది ప్రకంపనలు రేపుతోంది.

నిన్నటి వరకు సినిమా పరిశ్రమలోనే వినిపించిన 'మి టూ' ఉద్యమం ఇప్పుడు రాజకీయ పార్టీలకు, మీడియా సంస్థలకు కూడా పాకాయి. ప్రముఖ మీడియా సంస్థలను 'మి టూ'ఉద్యమం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తనుశ్రీ ద్వారా ఆరంభమైన ఉద్యమం సినీ పరిశ్రమను కుదిపేసింది.

మహిళా ఉద్యోగి లైంగిక ఆరోపణలు

మహిళా ఉద్యోగి లైంగిక ఆరోపణలు

తనుశ్రీ ద్వారా మొదలైన ఈ ఉద్యమంలో నటి కంగనా రనౌత్, గాయని చిన్మయి, నటి ఆశాసైనీలు లైంగిక వేధింపులకు గురయ్యామని చెప్పారు. ప్రముఖ పత్రిక హిందూస్థాన్ టైమ్స్‌లో పని చేసిన ఒక మహిళా ఉద్యోగి తమ పత్రిక రాజకీయ విభాగం సంపాదకుడు తనను లైంగికంగా వేధించాడని వెల్లడించడంతో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసారు.

షాకింగ్: సైకిల్‌పై వెళ్తుంటే ఓవర్ స్పీడ్, హెల్మెట్ లేదని చలానా, పోలీసులు జాలి కూడా చూపారు!షాకింగ్: సైకిల్‌పై వెళ్తుంటే ఓవర్ స్పీడ్, హెల్మెట్ లేదని చలానా, పోలీసులు జాలి కూడా చూపారు!

మీడియా సంస్థలకు 'మి టూ' సెగ

మీడియా సంస్థలకు 'మి టూ' సెగ

మీడియా సంస్థలకు 'మి టూ' సెగ తగలడం ప్రకంపనలు సృష్టిస్తోంది. హిందూస్థాన్ టైమ్స్ బ్యూరో చీఫ్ ప్రశాంత్ ఝా పైన సంస్థ మాజీ ఉద్యోగిని ఆరోపణలు చేసింది. దీంతో ఆయన రాజీనామా సమర్పించారు. అలాగే వినోద కార్యక్రమాలను రూపొందించే ఏఐబీ సంస్థ వ్యవస్థాపకులు కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఏఐబీ ఛానల్ సీఈవో పదవి నుంచి తన్మయ్ భట్ తప్పుకున్నారు.

ప్రశాంత్ ఝా రాజీనామా, కానీ

ప్రశాంత్ ఝా రాజీనామా, కానీ


హిందూస్థాన్ టైమ్స్ బ్యూరో చీఫ్ పదవికి రాజీనామా చేసిన ప్రశాంత్ ఝా అదే సంస్థలో రిపోర్టర్‌గా కొనసాగనున్నారు. ప్రశాంత్ ఝా తన రాజీనామా పత్రంలో.. తన నేషనల్ పొలిటికల్ ఎడిటర్/చీఫ్ బ్యూరో పదవికి రాజీనామా చేస్తున్నానని ఆ లేఖలో పేర్కొన్నారు. తనపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సంస్థకు చెడు పేరు రాకుండా ఉండేందుకు తాను వైదొలుగుతున్నట్లు తెలిపారు.

మేనకా గాంధీ స్పందన

మేనకా గాంధీ స్పందన

కాగా, మహిళలపై వేధింపుల అంశంపై కేంద్రమంత్రి మేనకా గాంధీ స్పందించారు. మన దేశంలోనూ మీ టూ ఉద్యమం ప్రారంభమైందని, లైంగిక వేధింపులపై అనేక మంది మహిళలు ధైర్యంగా మాట్లాడటం చాలా సంతోషకరమని ఆమె అన్నారు. మహిళళపై లైంగిక వేధింపులను సహించే ప్రసక్తి లేదన్నారు.

English summary
Amidst raging debate on what’s being termed as India’s own #MeToo movement exploding on social media platforms, two significant developments took place on Monday. First, Prashant Jha, the bureau chief of Hindustan Times, reportedly stepped down from his post after being accused of sexual harassment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X