గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!!
వంట గ్యాస్ బుకింగ్.. డెలివరీ విధానం లో కీలక విధానాల అమలుకు రంగం సిద్దమైంది. రాష్ ట్రంలో వంట గ్యాస్ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తాజాగా సీఎం చంద్రబాబు అందుబాటులో ఉన్న పలువురు మంత్రులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో గ్యాస్ కొరతపై ఆరా తీశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ముఖ్యమంత్రికి వివరించారు. అదే విధంగా ఆయిల్ కంపెనీలు ప్రతినిధులతో సంప్రదింపు లు చేస్తున్నారు. ప్రజలు ఆందోళన చెందకుండా సరఫరా విధానంలో సమస్యలు లేకుండా కొత్త చర్యలు నిర్దేశించారు.
వంట గ్యాస్ కొరత వేళ ప్రజలు ఆందోళన చెందకుండా ఈ సమస్యను సమర్థంగా ఎదుర్కునేలా ప్రభుత్వపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో.. ఎంత మేరకు చేయగలమో అంతా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని పూర్తి స్థాయి లో చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు. మరోవైపు హోటళ్ల నిర్వాహకులు, భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరిపి.. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని మంత్రులకు సూచించారు. రాష్ట్రంలో ఎల్పీజీ సిలిండర్లు సరఫరా చేస్తున్న చమురు కంపెనీలకు చెందిన రాష్ట్రస్థాయి కో-ఆర్డినేటర్, బీపీసీఎల్, హెచ్‌సీఎల్, ఐవోసీఎల్ ప్రతినిధులతోపాటు ఉన్నతాధికారులతో మంత్రులు చర్చించారు. రాష్ట్రంలో వంట గ్యాస్ రోజువారీ డిమాండ్ ఎంత... ప్రస్తుతం ఎంత మేరకు సరఫరా చేస్తున్నారనే వివరాలను సేకరించారు.

ఆన్ లైన్ బుకింగ్.. ఓటీపీ తో డెలివరీ
రాష్ట్రంలో ప్రస్తుతం గ్యాస్ కొరత నెలకొన్నందున ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గ్యాస్ సరఫరా చేసే అవకాశాలపై మంత్రులు చర్చించారు. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, అనంతపురం, కడప, కర్నూలు, కాకినాడ తదితర నగరాల్లో ఇంటింటికీ గ్యాస్ పైప్‌లు ఏర్పాటు చేసినందున.. ఆ పైప్‌లైన్ల ద్వారా రిఫైనరీల నుంచి గ్యాస్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. వెంటనే పైప్డ్ గ్యాస్ కంపెనీలతో సమావేశమై చర్చించాలని మంత్రులు నిర్ణయించారు. గృహావసరాలకు ఆన్‌లైన్‌లోనే గ్యాస్ బుక్ చేయాలని, వినియోగదారుల నుంచి ఓటీపీ తీసుకున్న తర్వాతే గ్యాస్ సిలిండరు డెలివరీ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని రాష్ట్రంలో గ్యాస్ సరఫరా వ్యవస్థలను మరింత పటిష్ఠం చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రిఫైనరీల్లో గ్యాస్ ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్యాస్ సిలిండ్లను బ్లాక్ మార్కెట్‌కు తరలించకుండా కట్టుదిట్టుమైన నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేం ద్రాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని నిర్ణయించారు.
-
ఏపీలో మహిళలకు దక్కే నియోజకవర్గాలు లిస్టు ఇదే, కీలక మంత్రుల స్థానాలు సైతం..!! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఎల్పీజీ స్ధానంలో PNG కనెక్షన్ తీసుకుంటే - ఏపీ సర్కార్ భారీ సబ్సిడీ ఆఫర్ ..! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications