Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..!

పాకిస్తాన్ మిస్టరీ బౌలర్ అబ్రార్ అహ్మద్ (abrar ahmed)ను జట్టులోకి తీసుకుని విమర్శల దాడి ఎదుర్కొంటున్న సన్ రైజర్స్ హైదరాబాద్ (sunrisers hyderabad) ఫ్రాంచైజీకి తాజాగా భారీ ఊరట లభించింది. అలాగే పాకిస్తాన్ సూపర్ లీగ్ ను కాదని లండన్ లో సన్ రైజర్స్ లీడ్స్ జట్టుకు ఆడేందుకు సిద్ధమవుతున్న అబ్రార్ అహ్మద్ ఆశలపై పీసీబీ నీళ్లు జల్లింది. తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయంతో సన్ రైజర్స్ జట్టుకు ఊరట లభించగా.. అబ్రార్ కు షాక్ తప్పలేదు.

పాకిస్తాన్‌కు చెందిన అబ్రార్ అహ్మద్‌ను భారత్ కు చెందిన ఐపీఎల్ ఫ్రాంచైజ్ సన్‌రైజర్స్ లీడ్స్ 2.34 కోట్లకు ది హండ్రెడ్ వేలంలో ఎంపిక చేసినప్పటి నుండి విమర్శల పాలవుతోంది. ముఖ్యంగా పహల్గాం దాడుల తర్వాత పాకిస్తాన్ పై దేశంలో భారీగా పెరిగిన వ్యతిరేకత మధ్య ఆ దేశ ఆటగాడిని విదేశీ లీగ్ లో అయినా సన్ రైజర్స్ ఎందుకు కొనుగోలు చేయాలన్న ప్రశ్నలు తలెత్తాయి. దీంతో జట్టు యజమాని అయిన కావ్యా మారన్ ఇబ్బందుల్లో పడ్డారు.

Abrar Ahmed in The Hundred How PCB s Intervention Saved Sunrisers Leeds from Backlash

ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఒప్పందాల కారణంగా అబ్రార్ అహ్మద్ .. లండన్ లో సన్‌రైజర్స్ తరపున ఆడటానికి కూడా రాకుండా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అడ్డుకట్ట వేసింది. పాకిస్తాన్ జట్టు ది హండ్రెడ్ జరిగే సమయంలో వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అబ్రార్ కు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వకూడదని నిర్ణయించింది. రెండు టెస్ట్‌ల సిరీస్ కోసం పాకిస్తాన్ జూలై 15 నుండి ఆగస్టు 7 వరకు వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ది హండ్రెడ్ జూలై 21న ప్రారంభమై ఆగస్టు 16 వరకు కొనసాగుతుంది.ఈ నేపథ్యంలో జాతీయ జట్టును కాదని సన్ రైజర్స్ కు ఆడేందుకు అతన్ని అనుమతించలేదని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+