సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !!
ఐకాన్ స్టార్ "అల్లు అర్జున్" ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టగా.. పుష్ప 2 అయితే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. దీంతో ఆయన గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే బన్నీ నెక్స్ట్ ప్రాజెక్టులపై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకున్నాయి. ఇప్పటికే తమిళ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఆయన చేస్తున్న మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సన్ పిక్చర్స్ సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. AA 22 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తున్నట్టు ప్రకటించారు.
కాగా రీసెంట్ గానే అల్లు వారి ఇంట్లో పెళ్లి భాజంత్రీలు మోగాయి. యంగ్ హీరో అల్లు శిరీష్ - నయనిక రెడ్డి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు అల్లు ఫ్యామిలితో పాటు మెగా కుటుంబ సభ్యులు.. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. కాగా ఇప్పుడు లేటెస్ట్ గా అల్లు అర్జున్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు క్షమాపణలు తెలుపడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్ సైతం నెట్టింట చక్కర్లు కొడుతుంది.

ఈ మేరకు ఆ పోస్టులో..
గౌరవనీయులైన AP ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు.. సిరి & నయనికను ఆశీర్వదించడానికి, మా కుటుంబానికి మీ శుభాకాంక్షలు తెలియజేయడానికి మా ఇంటికి వ్యక్తిగతంగా వచ్చినందుకు సంతోషం అంటూ రాసుకొచ్చారు. కొత్త జంటకు మీ ఆప్యాయత, ఆశీర్వాదాలకు మేము నిజంగా కృతజ్ఞులమని పేర్కొన్నారు. అయితే క్షమించండి ఆ సమయంలో నేను విదేశాల్లో ఉన్నాను, కానీ మీతో ఫోన్‌లో మాట్లాడటం నాకు సంతోషంగా ఉందని పోస్ట్ చేశారు. మీరు చూపిన ఈ చొరవ నా మనసును ఎంతగానో తాకింది అని మెన్షన్ చేశారు.
మరోవైపు రీసెంట్ గానే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. కాగా ఈ చిత్రానికి #AALoki #AA23 #LK7 వంటి వర్కింగ్ టైటిల్స్ చేయగా.. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర గ్లింప్స్ షేర్ చేశారు. ఈ ఏడాదిలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ కానున్నట్లు తెలుస్తోంది.
Thank you Hon’ble CM of AP @ncbn garu for personally visiting our residence to bless Siri & Nayanika and extend your wishes to our family.
— Allu Arjun (@alluarjun) March 15, 2026
Sorry, I was abroad at the time, but I was happy to speak with you over the phone.
We are truly grateful for your warmth and blessings to… pic.twitter.com/fEHUsweJ9s
-
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్












Click it and Unblock the Notifications