Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..!

నిన్న రాత్రి తెలంగాణలోని హైదరాబాద్ శివారు మొయినాబాద్ లో జరిగిన డ్రగ్స్ పార్టీలో పాజిటివ్ గా తేలిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ (putta mahesh Yadav)ను వెంటనే సస్పెండ్ చేయాలని పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల (ys sharmila) సీఎం చంద్రబాబు (Chandrababu)ను డిమాండ్ చేశారు. మొయినాబాద్ డ్రగ్స్ పార్టీలో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ దొరకడం సిగ్గుచేటని ఆమె విమర్శించారు. ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతుంటే ఈ ఎంపీ ఇక్కడ కొకైన్ తో విందు చిందు చేస్తున్నాడన్నారు.

రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇదెక్కడి బాధ్యతా రాహిత్యం అంటూ షర్మిల ప్రశ్నించారు. డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది కదా.. ఇప్పుడు చంద్రబాబు ఎం చర్యలు తీసుకుంటారని చంద్రబాబును నిలదీశారు. డ్రగ్స్ తీసుకుంటూ పట్టబడ్డ ఎంపీ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడని అడిగారు. యువత డ్రగ్స్ వాడాలని ఎంపీ ఎంకరేజ్ చేస్తున్నారా?, ఓట్లేసి గెలిపించిన ఏలూరు ప్రజలకు MP ఏం సమాధానం చెప్తారంటూ షర్మిల విమర్శలు ఎక్కుపెట్టారు.

YS Sharmila Demands Chandrababu Naidu Suspend Drug-Positive TDP MP Putta Mahesh

ఎంపీ పదవి నుంచి పుట్టా మహేష్ ను వెంటనే తొలగించాలని షర్మిల డిమాండ్ చేశారు. అలాగే టీడీపీ పార్టీ నుంచి వెంటనే సస్పెన్షన్ విధించాలన్నారు. డ్రగ్స్ పై నిజంగా ఉక్కుపాదం మోపితే ఎంపీపై చర్యలు తీసుకొని చంద్రబాబు చిత్తశుద్ధి నిరూపించుకోవాలని షర్మిల సూచించారు. నిన్న మొయినాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఇచ్చిన పార్టీలో పాల్గొన్న పుట్టా మహేష్ యాదవ్ కు ర్యాండమ్ టెస్ట్ నిర్వహించగా.. నెగెటివ్ వచ్చింది. కానీ ఇవాళ బ్లడ్ టెస్టులో మాత్రం పాజిటివ్ గా వచ్చినట్లు పోలీసులు ప్రకటించారు. దీంతో ఈ వ్యవహారం టీడీపీకి తలనొప్పిగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+