Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే

పవన్ కల్యాణ్ నటిస్తోన్న సినిమా.. ఉస్తాద్ భగత్ సింగ్. హైఓల్టేజ్ యాక్షన్‌ మూవీ ఇది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. హరీష్ శంకర్ దర్శకుడు. మైత్రీ మూవీస్ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ సినిమాను నిర్మించారు. శ్రీలీల హీరోయిన్. అశుతోష్ రాణా, నవాబ్ షా, అవినాష్, గౌతమి కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. తమిళంలో విజయ్ నటించిన థేరి సినిమాకు రీమేక్ ఇది. దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా ట్రైలర్ శనివారమే విడుదలైంది. అద్దిరిపోయే వ్యూలను నమోదు చేస్తోంది. ఇప్పటివరకు ఉన్న హైప్ ను మరింత పెంచింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపించడాన్ని ఖాయం చేసింది. పైగా పవన్ కల్యాణ్- హరీష్ శంకర్ జోడీ గతంలో గబ్బర్ సింగ్ తో రికార్డులు తిరగరాసింది కూడా. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సైతం అదే స్టైల్‌లో ఉంటుందని సంబరపడుతున్నారు ఫ్యాన్స్. దీనికి తోడు పవన్ కల్యాణ్ రగ్డ్ లుక్స్‌లో కనిపిస్తోండటం సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ ను ఓ రేంజ్ కు తీసుకెళ్లింది. ఈ నెల 19వ తేదీన విడుదల కాబోతోంది.. ప్రపంచవ్యాప్తంగా.

Megastar Extends Warm Wishes to Pawan Kalyan Harish Shankar and Ustaad Bhagat Singh Movie Crew

ఈ సాయంత్రం 5 గంటలకు ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది. హైదరాబాద్ యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో ఈ ఈవెంట్ జరుగనుంది. దీనికి పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు. దర్శకుడు హరీష్ శంకర్, హీరోయిన్ శ్రీలీల, ఇతర నటీనటులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నిర్మాతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమాపై ముందే ఉన్న ఆకాశమంత అంచనాలు ఉన్నందు వల్ల ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో అభిమానుల తరలి రావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఓ పండుగ వాతావరణాన్ని వారికి అందించనుంది. నిర్మాతలు ఈ ఈవెంట్‌ను చాలా ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారు. వేదిక అభిమానుల కోలాహలంతో నిండిపోవడం ఖాయం. సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు, తాజా అప్‌డేట్‌లు ఇక్కడ వెల్లడయ్యే అవకాశం ఉంది, 'ఉస్తాద్ భగత్ సింగ్'కు ఇది అత్యంత కీలకమైన ప్రచార కార్యక్రమం.

కాగా- ఉస్తాద్ ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు. పవన్ కల్యాణ్- హరీష్ శంకర్ మ్యాజిక్ జరిగిందని కితాబిచ్చారు. విడుదల ముహూర్తం కూడా కుదిరిందని, దీనికి తోడు ట్రైలర్ అదిరిపోయిందని అన్నారు. ఉగాదికి వస్తోన్న "ఉస్తాద్ భగత్ సింగ్" తో అన్నీ శుభాలేనని పేర్కొన్నారు. ఉస్తాద్ ట్రైలర్ లింక్ ను తన అధికారిక ఎక్స్ అకౌంట్ పోస్ట్ చేశారు.

దీనికి హరీష్ శంకర్ రిప్లై ఇచ్చారు. టైమింగ్, రైమింగ్ చూస్తుంటే అన్నయ్యకు ట్రైలర్ ఏ రేంజ్ లో నచ్చిందో అర్థమైందని, అవుటాఫ్ కంట్రీలో ఉన్నా కూడా వీలు చేసుకుని ట్రైలర్ చూసినందుకు, అభినందనలు తెలిపినందుకు తన ఆనందానికి అవధులు లేవని చెప్పారు. మెగా ఆశీర్వాదం కూడా దొరికింది కాబట్టి ఇక మెరుపు వేగంతో దూసుకెళ్లడమే మిగిలివుందని, చిరంజీవి ట్వీటు పెడితే...హీటు పెరిగినట్టే అని వ్యాఖ్యానించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+