విడుదల వేళ.. ఉస్తాద్ షాకింగ్ డెసిషన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. దీనిపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందీ మూవీ. ఉగాది పండుగ సీజన్‌లో థియేటర్లలోకి రాబోతోంది. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లు. మైత్రీ మూవీస్ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ సినిమాను నిర్మించారు. అశుతోష్ రాణా, నవాబ్ షా, అవినాష్, గౌతమి కీలక పాత్రల్లో నటించారు.
సినిమా టిక్కెట్ ధరల పెంపుపై కొద్ది రోజులుగా విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అభిమానులకు శుభవార్త అందింది. నైజాం ప్రాంతంలో టికెట్ రేట్లు పెంచకూడదని మైత్రీ మూవీస్ మేకర్స్ నిర్ణయించింది. ఎప్పట్లాగే సాధారణ టిక్కెట్ ధరలకే ప్రేక్షకుల ముందుకు తీసుకుని రాబోతోంది. మామూలు టికెట్ రేట్లకే ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల కానుంది. ఈ నిర్ణయం తెలంగాణలో పవన్ కళ్యాణ్ అభిమానులను ఆనందంలో నింపింది.

స్టార్ హీరోల భారీ చిత్రాలు విడుదలైనప్పుడు మొదటి వారం లేదా 10 రోజుల పాటు టిక్కెట్ ధరలను పెంచడం తెలుగు చిత్ర పరిశ్రమలో ఆనవాయితీగా వస్తోన్న విషయం తెలిసిదే. హైబడ్జెట్ సినిమాల ద్వారా ప్రారంభ రోజుల్లో ఎక్కువ ఆదాయం పొందాలనే ఉద్దేశంతో అదనపు ఛార్జీలు, ప్రత్యేక ప్రదర్శనలను నిర్వహించడం మనం చూస్తుంటాం. దీనికి భిన్నంగా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తాజా నిర్ణయం తీసుకుంది.
నైజాం ప్రాంతంలో ఈ సినిమా పంపిణీ బాధ్యతలను కూడా మైత్రీ మూవీ మేకర్సే చూసుకుంటోంది. ఈ ఏరియాలో టిక్కెట్ ధరలను ఏమాత్రం పెంచకుండా ప్రభుత్వం ఆమోదించిన సాధారణ రేట్లకే సినిమాను ప్రదర్శించాలని చిత్ర నిర్మాణ సంస్థ నిర్ణయించింది. దీనివల్ల నైజా ఏరియా ప్రేక్షకులు ఎటువంటి అదనపు ధరను చెల్లించకుండానే ఈ చిత్రాన్ని వీక్షించగలరు. తెలంగాణలో ఈ సినిమా మొదటి షో గురువారం ఉదయం 7:30 గంటలకు ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం.
ఈ నిర్ణయం వెనుక రెండు ప్రధాన కారణాలు ఉన్నాయనేది ఫిల్మ్ నగర్ టాక్. మొదటిది- తెలంగాణ హైకోర్టు గతంలో స్పష్టంగా జారీ చేసిన మార్గదర్శకాలను పాటిస్తూ చట్టపరమైన చిక్కులను నివారించడం. ఈ విషయంలో మైత్రీ మూవీ మేకర్స్ సుప్రీంకోర్టుకు వెళ్లి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే తెచ్చుకుంది. రెండవది- సినిమాను సామాన్య ప్రేక్షకులకు మరింత అందుబాటులోకి తీసుకురావడం. సాధారణ టిక్కెట్ ధరలు ఉంటే ఉగాది పండగ సీజన్ లో ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి చిత్రాన్ని చూస్తారని భావిస్తోంది.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications