భర్తను క్రికెట్ బ్యాట్ తో కొట్టి చంపిన భార్య, మంచం మీద, ఫ్యామిలీకి సినిమా స్టోరి, చివరికి!
బెంగళూరు: కుటుంబ సమస్యల కారణంగా భర్తను హత్య చేసిన భార్య తరువాత నాటకాలు ఆడింది. వదిన మీద అనుమానం రావడంతో భర్త సోదరి ఫిర్యాదు చెయ్యడంతో విచారణ జరిపిన పోలీసులు చివరికి భార్యను అరెస్టు చేసి జైలుకు పంపించారు.

దంపతుల గొడవ
కర్ణాటకలోని హుబ్బళి నగరంలోని విద్యానగర్ లో శివయోగి, కావ్యా (40) దంపతులు నివాసం ఉంటున్నారు. కుటుంబ సమస్యల కారణంగా శివయోగి, కావ్యా దంపతులు నిత్యం గొడవ పడుతున్నారు. మే 2వ తేదీన దంపతులు గొడవపడ్డారు.

మంచం మీద
దంపతుల మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. ఆ సమయంలో క్రికెట్ బ్యాట్ తీసుకున్న కావ్య భర్త శివయోగి తల మీద బలంగా దాడి చేసింది. తీవ్రగాయం కావడంతో శివయోగి మరణించాడు. మద్యం మత్తులో తన భర్త మంచం మీద నుంచి కిందపడి మరణించాడని కావ్యా కుటుంబ సభ్యులను నమ్మించింది.

వదిన మీద అనుమానం
శివయోగి కుటుంబ సభ్యులు కావ్యా చెప్పిన మాట నిజమే అని నమ్మి అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే శివయోగి సోదరికి వదిన కావ్యా మీద అనుమానం వచ్చింది. తన సోదరుడు శివయోగి మంచం మీద నుంచి కిందపడి మరణించలేదని, విచారణ జరిపించాలని విద్యానగర్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు.

కావ్యా డ్రామాలు
పోలీసులు కేసు నమోదు చేసి కావ్యా మీద నిఘా వేశారు. పోలీసులకు అనుమానం వచ్చి కావ్యాను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. గొడవ జరిగిన సందర్బంలో తాను సహనం కొల్పోయి క్రికెట్ బ్యాట్ తో దాడి చెయ్యడం వలనే తన భర్త శివయోగి మరణించాడని కావ్యా అంగీకరించిందని మంగళవారం పోలీసులు తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications