అయోధ్యకు భారీ ఆహార విరాళాలు- దేశం నలుమూలల నుంచి 300 టన్నుల బియ్యం, కూరగాయలు...

ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో జనవరి 22న జరిగే మహా సంప్రోక్షణ మహోత్సవానికి భారీ ఎత్తున ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రధాని, రాష్ట్రపతితో పాటు భారీ సంఖ్యలో ప్రముఖులు హాజరయ్యే ఈ కార్యక్రమానికి అంతకు మించి లక్షలాదిగా భక్తులు కూడా హాజరుకాబోతున్నారు. దీంతో వీరికి అక్కడే అన్నదానం జరగబోతోంది. దీనికి విరాళంగా దేశం నలుమూలల నుండి ప్రజలు కూరగాయలు, బియ్యం, ఇతర ఆహార పదార్థాలను అయోధ్యకు పంపుతున్నారు.

రామ మందిర ప్రారంభోత్సవ వేడుకకు లక్షలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది కాబట్టి వారికి సరిపోయేలా భారీ ఎత్తున వంటలు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వంటశాలలు కూడా నిర్మించారు. ఈ నేపథ్యంలో బియ్యం, సుగంధ ద్రవ్యాలు, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలతో సహా సుమారు 300 టన్నుల ఆహార రేషన్ అయోధ్యకు వస్తున్నట్లు అంచనా. ఈ ఆహారం అంతా అయోధ్యలోని 'కార్యశాల'లో నిల్వ చేస్తారు.

huge donations of rice, vegetables other food items for Ayodhya ram temple consecration ceremony

భక్తులు అయోధ్యలోకి రావడం మొదలయ్యాక వంటలు ప్రారంభిస్తారు. అప్పుడు వీటిని వాడాలని ట్రస్ట్ నిర్ణయించింది. మరోవైపు భారతీయ పురాణాలలో రాముడి మాతృభూమి అయిన రాయ్‌పూర్ నుండి కూడా బియ్యం ట్రక్కులు వస్తున్నాయి.అలాగే మిగిలిన ప్రాంతాల నుంచి కూడా భారీ ఎత్తున ఆహార ధాన్యాలు, పదార్ధాలు వచ్చి పడుతున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు స్టోర్ చేస్తున్నారు. అయోధ్య రామాలయంలో విగ్రహాల ప్రాణప్రతిష్ట రోజు ఎవరూ ఆకలితో వెనుదిరగకుండా ట్రస్టు సభ్యులు భారీ ఏర్పాట్లు చేయిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+