లాలూనే లాక్కుని కౌగలించుకున్నారు: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్‌యాదవ్‌ను కౌగలించుకోవడంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వివరణ ఇచ్చా రు. తాను ఆలింగనం చేసుకున్నది లాలూనే కానీ, ఆయన అవినీతి రికార్డులని కాదని స్పష్టం చేశారు.

పార్టీ జాతీయ మండలి సమావేశంలో ఆయన సోమవారం మాట్లాడారు. తాను ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ అవినీతిని వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. నితీశ్ ప్రమాణ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా తనకు ఎదురుపడిన లాలూ కరచాలనం చేసి, దగ్గరకు లాక్కుని హత్తుకున్నారని వివరణ ఇచ్చారు.

 Hugged Lalu but didn't hug his corruption record: Arvind Kejriwal

కాగా, లాలూ, కేజ్రీవాల్ కౌగిలింత సిగ్గుమాలిన చర్య అని పేర్కొన్నారు. అవినీతిపరుడితో ఫొటో దిగడం అంటే అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాన్ని అమ్మేయడమేనని పార్టీ బహిష్కృత నేత యోగేంద్రయాదవ్ విమర్శించారు. సామాజికమీడియాలోనూ ఈ అంశంపై విమర్శలు వెల్లువెత్తాయి.

2019 ఎన్నికల రేస్‌లో ఆప్ ఉండబోదని ఆ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. పంజాబ్‌లోనూ ఢిల్లీ తరహా ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్లు సంకేతాలు ఉన్నాయని తెలిపారు. పార్టీ కార్యకర్తలు ఎన్నికల కోసం పరుగులు తీయకుండా, తమ పని తాము చేసుకుపోతే చాలని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+