వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Friendship Day:మోదీ ఇద్దరు మిత్రులు -ప్రధానికి రాహుల్ గాంధీ విష్ మామూలుగా లేదుగా -viral video

|
Google Oneindia TeluguNews

సృష్టిలో తీయనైనది స్నేహమే అని, జీవితంలో శాశ్వతమైనదీ స్నేహమేనని, ట్రెండ్స్ మారినా ఫ్రెండ్స్ ఎన్నటికీ మారబోరని.. ఇంకా ఎన్నోనే మాటలు, స్పెషల్ కోట్స్ తో యావత్ ప్రపంచం ఇవాళ ఫ్రెండ్‌షిప్ డే జరుపుకొంటున్నది. ఇండియాకు సంబంధించి ఫ్రెండ్‌షిప్ డే కోట్స్ లో మరో వాక్యాన్ని కచ్చిగంగా చేర్చాలంటారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. 'హమ్ దో.. హమారే దో', అంటే, మేం ఇద్దరం.. మాకు ఇద్దరు స్నేహితులు అనే మాటను రాహుల్ ఎంతగా పాపులర్ చేశారో తెలిసిందే. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆ మాటను రాహుల్ మరోసారి మోదీపై ప్రయోగించారు..

ఇంటర్నేషనల్ ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనూహ్య రీతిలో విషెస్ తెలియజేశారు. మోస్ట్ పాపులర్ టీవీ షో 'ఫ్రెండ్స్' థీమ్ సాంగ్ ను జతపర్చి రాహుల్ పోస్ట్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారింది. ''హమ్ దో.. హమారే దో' అనే మోదీ సర్కారుకు ఫ్రెండ్‌షిప్ డే శుభాకాంక్షలు' అనే కామెంట్ తో సదరు వీడియోను పోస్ట్ చేశాడు రాహుల్.

ఈశాన్యంలో రక్తపాతం: ప్రధాని మోదీపై మణిపూర్ సీఎం బీరేన్ కీలక వ్యాఖ్యలు -బీజేపీలోకి మాజీ పీసీసీ చీఫ్ఈశాన్యంలో రక్తపాతం: ప్రధాని మోదీపై మణిపూర్ సీఎం బీరేన్ కీలక వ్యాఖ్యలు -బీజేపీలోకి మాజీ పీసీసీ చీఫ్

ప్రధాని మోదీకి ఇద్దరే ఇద్దరు మిత్రులని, ఆ ఇద్దరూ గుజరాత్ కు చెందిన బడా బాబులని, వారిలో ఒకరు రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ అయితే, రెండో వ్యక్తి అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ అని, ప్రధాని మోదీ ప్రభుత్వ పరంగా ఏ చిన్న పని చేసినా తన ఇద్దరు మిత్రులకు ప్రయోజనం కలిగేలా చూసుకుంటారని రాహుల్ గాంధీ గతం నూచీ ఆరోపిస్తూ వస్తున్నారు. ఇవాళ్టి..

ఫ్రెండ్‌షిప్ డే నేపథ్యంలో ప్రధాని మోదీకి విషెస్ చెబుతూ రాహుల్ గాంధీ పోస్ట్ చేసిన వీడియోలో.. మోదీ వివిధ సందర్భాల్లో ముఖేశ్ అంబానీ, గౌతం అదానీలతో కలిసున్న ఫొటోలను, వారు సరదాగా సంభాషిస్తోన్న దృశ్యాలను పొందు పర్చారు. ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ప్రధానికి రాహుల్ విషెస్ చెప్పిన తీరు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. మరోవైపు,

కొవిడ్ టీకా తీసుకున్న రాహుల్ గాంధీ -ప్రధాని మోదీపై ఫైర్ -ఎల్ఏసీనే కాదు, రాష్ట్రాల సరిహద్దులు సురక్షితంగా లేవుకొవిడ్ టీకా తీసుకున్న రాహుల్ గాంధీ -ప్రధాని మోదీపై ఫైర్ -ఎల్ఏసీనే కాదు, రాష్ట్రాల సరిహద్దులు సురక్షితంగా లేవు

Hum Do Humare Do: here is how Rahul Gandhi wishes PM Modi on Friendship Day

దేశంలో కొవిడ్ వ్యాక్సిన్ల కొరత, వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహణలో మోదీ సర్కార్ వైఫల్యాన్ని ఎండగడుతూ రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. ''జులై నెల వెళ్లిపోయింది.. కానీ, కొవిడ్ వ్యాక్సిన్ల కొర‌త మాత్రం పోలేదు. వ్యాక్సిన్లు ఎక్క‌డ‌?'' అంటూ కేంద్రాన్ని నిలదీశారాయన. సరిగ్గా జులై 2న కూడా రాహుల్ గాంధీ ఇదే తరహాలో 'జూన్ పోయింది.. వ్యాక్లిన్లెక్కడ?' అని ట్వీట్ చేసి ఉండటం గమనార్హం.

English summary
Taking a jibe at the BJP-led central government, Congress leader Rahul Gandhi on Sunday posted a video on his social media showing Prime Minister Narendra Modi with several industrialists and wished 'Happy Friendship Day'. "Happy Friendship Day to 'Hum Do Humare Do' ki sarkar," Rahul Gandhi said in an Instagram post with the video, which had music from popular sitcom 'Friends'. Rahul Gandhi also slams pm modi over shortage of covid vaccine
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X