Human Sacrifice: మహిళల నరబలి కేసులో లైలాకు షాక్, కిలాడీ లేడీకి బెయిల్ ఇవ్వద్దండి !
తిరువనంతపురం/ఎర్నాకులం: మంత్రగాడి మాయలో పడిన కేరళ వైద్యుడు భగవాల్ సింగ్ దంపతులు ఇద్దరు మహిళలను అతని ఇంట్లోనే చంపేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. పోలీసుల విచారణలో వైద్యుడు, అతని భార్య, మంత్రగాడు అసలు మ్యాటర్ చెప్పడంతో కేరళ ప్రజలు హడలిపోయారు. మహిళలను హత్య చేసి వారి శవాలను 60 ముక్కలు చేశారని వెలుగు చూసింది. మహిళల అవయవాలు, వారి శరీరంలోని ముక్కలు, రక్తం ఇంటిలో చల్లారని వెలుగు చూసింది. సినిమా షూటింగ్ అని చెప్పి ఇద్దరు మహిళలను నగ్నంగా మంచానికి కట్టేసి దారుణంగా చంపేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఇంతచేసిన వైద్యుడి భార్య తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని కోర్టును ఆశ్రయించింది. అయితే పోలీసుల ఎంట్రీతో లైలాకు సినిమా కనపడింది.

మంత్రగాడు, నాటువైద్యుడు
కేరళలోని పతనంమిట్టలోని తిరువళ్లలో నివాసం ఉంటున్న నాటు వైద్యుడు భగవాల్ సింగ్, లైలా దంపతులు ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నకిలి మాంత్రికుడు, మంత్రగాడు మోహమ్మద్ షఫీ గురించి తెలుసుకున్న భగవాల్ సింగ్ అతన్ని కలిశాడు. మీ ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే ఇద్దరు మహిళలను నరబలి ఇవ్వాలని మాంత్రికుడు మోహమ్మద్ షఫీ నాటు వైద్యుడు భగవాల్ సింగ్ కు చెప్పాడు.

డీల్ మాట్లాడుకున్న డాక్టర్
మహిళలను నువ్వు పిలుచుకుని వచ్చి నరబలి ఇవ్వాలని, డబ్బులు ఎంత ఖర్చు అయినా పర్వాలేది భగవాల్ సింగ్ మంత్రగాడు మోహమ్మద్ షఫీకి చెప్పాడు. ఎర్నాకుళంలో లాటరీ టికెట్లు అమ్ముతున్న పద్మా (52), రోసలిన్ (49) అనే ఇద్దరు మహిళలను నరబలి ఇవ్వాలని మోహమ్మద్ షఫీ డిసైడ్ అయ్యాడు.

సినిమా చాన్స్ లు
మంత్రగాడు మోహమ్మద్ షఫీ వేర్వేరుగా లాటరీ టిక్కెట్లు విక్రయిస్తున్న రోసలిన్, పద్మాలను కలిశాడు. మళయాలం బూతు సినిమాల్లో నటించడానికి మీకు చాన్స్ ఇప్పిస్తానని, మీరు నాతో వస్తే మీకు భారీగా డబ్బులు కూడా ఇస్తారని మాయమాటలు చెప్పాడు. రోసలిన్, పధ్మాలను నేరుగా నాటు వైద్యుడు భగవాల్ సింగ్ ఇంటికి పిలుచుకుని వెళ్లారు.

మంచానికి నగ్నంగా కట్టేసి ?
వైద్యుడు భగవాల్ సింగ్ లాల్ ఇంట్లో క్షద్రపూజలు చేసిన మంత్రగాడు మోహమ్మద్ షఫీ పూజలో కుర్చున్న రోసలిన్ ను, తరువాత పధ్మాను ఇక్కడ సినిమా షూటింగ్ జరుగుతోందని, ఇప్పుడు మంచానికి కట్టేయాలని, కొంతసేపు అలాగే ఉండాలని మాయమాటలు చెప్పాడు. రోసలిన్, పధ్మాలను నగ్నంగా చేసి మంచానికి కట్టేసిన తరువాత మంత్రగాడు మోహమ్మద్ షఫీ, నాటు వైద్యుడు భగవాల్ సింగ్, అతని భార్య లైలాలు కలిసి ఇద్దరిని దారుణంగా చంపేశారు. రోసలిన్, పద్మాలను కొన్ని నెలల గ్యాప్ తో నిందితులు హత్య చేశారు.

మహిళల చివరి ఫోన్ కాల్స్
రోసలిన్ కనపడటం లేదని ఉత్తరప్రదేశ్ లో ఉన్న ఆమె కూతురు, పధ్మా కనపడటం లేదని తమిళనాడులోని ధర్మపురిలో ఉన్న ఆమె భర్త కేసులు పెట్టడంతో పోలీసులు రంగంలోకి దిగారు. రోసలిన్, పధ్మాల మొబైల్ ఫోన్ లకు చివరికిసారి ఎవరు ఫోన్ చేశారు అని ఆరా తీస్తే ఇద్దరికి మంత్రగాడు మోహమ్మద్ షఫీ ఫోన్ చేశాడని వెలుగు చూసింది. మోహమ్మద్ షఫీతో పాటు భగవాల్ సింగ్, లైలా పోలీసులకు చిక్కిపోయారు.

బెయిల్ కోసం కోర్టులో లైలా పిటీషన్
మహిళల నరబలి కేసుల్లో భగవాల్ సింగ్, లైలా దంపతులు, మంత్రగాడు మోహమ్మద్ షఫీ జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్న లైలా తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని కేరళలోని ఎర్నాకులం జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేసింది. మహిళల నరబలి కేసులో లైలాకు బెయిల్ ఇవ్వరాదని కేసు విచారణ చేస్తున్న పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

నరమాంసం తిన్న లైలాకు బెయిల్ ఇవ్వకూడదు
రోసలిన్, పధ్మాలను చంపేసి శవాలను 60 ముక్కలు చేశారని, తరువాత లైలా, భగవాల్ సింగ్ దంపతులు ఆ ముక్కలను కుక్కర్ వేసి వంట చేపుకుని తిన్నారని, ఈ విషయం దంపతులు స్వయంగా అంగీకరించారని, ఈ కేసు విచారణ ఇంకా పూర్తి కాలేదని, ఇలాంటి సమయంలో లైలాకు బెయిల్ మంజూరు చెయ్యకూడదని కేసు విచారణ చేస్తున్న పోలీసులు కోర్టుకు మనవి చేశారు. వాదనలు విన్న కోర్టు లైలా వేసుకున్న బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications