Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఈడీ, సీబీఐలతో వేటాడుతోంది: బీజేపీపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తీవ్ర విమర్శలు

రాంచీ:ఈడీ, సీబీఐలను ఉపయోగించి ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను అస్థిరపరుస్తోందంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు జార్ఖండ్ సీఎం, జేఎంఎం నేత హేమంత్ సోరెన్. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీలను వేటాడంలో బీజేపీ దిట్ట అని మండిపడ్డారు. అలా చేసి ఆ పార్టీ అనేక ప్రభుత్వాలను పడగొట్టిందని ఆరోపించారు. తమ ప్రభుత్వాన్ని కూడా అస్థిరపర్చిందన్నారు.

హేమంత్ సోరెన్ సహాయకుడు సునీల్ శ్రీవాత్సవ ఇంట్లో ఆదాయపుపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు. హేమంతో సోరెన్ శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రాలపై జీఎస్టీ విధించి, వారికి ఆదాయం వనరులు లేకుండా చేసి.. పేద రాష్ట్రాల నడ్డి విరిచిందని ఆరోపించారు. జార్ఖండ్ రాష్ట్రాన్ని బీజేపీ రెండు దశాబ్దాలకు సరిపడా పిండేసిందని అన్నారు.

Hunting with ED and CBI Jharkhand CM Hemant Soren criticizes BJP

రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి బీజేపీ పలు ప్రయత్నాలు చేసిందని.. అవి బెడిసికొట్టడంతో తనపై కుట్ర పన్ని జైలుకు పంపిందని హేమంత్ సోరెన్ ఆరోపించారు. హిందూ-ముస్లిం పోలరైజేషన్, మత విద్వేషాలు, విభజన రాజకీయాలు మినహా బీజేపీకి మరో అజెండా లేదని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీకి పదే పదే లేఖలు రాసినా కేంద్రం నుంచి అందాల్సిన రూ. 1.36 లక్షల కోట్ల బొగ్గు బకాయిలు చెల్లించలేదని ఆరోపించారు. వాటిని ఎలా పొందాలో తమకు తెలుసని అన్నారు.

ఒక గిరిజన సీఎం జార్ఖండ్ సీఎంగా ఉండటాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతోందని హేమంత్ సోరెన్ మండిపడ్డారు. రాష్ట్రంలో నెలలతరబడి ఎన్నికల ప్రచారం చేస్తున్న సీఎంలు వారి రాష్ట్రాల పరిస్థితులను ఎందుకు పట్టించకోవడం లేదని ప్రశ్నించారు. జార్ఖండ్‌లో చొరబాటుదారుల గురించి మాట్లాడే కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ సొంత పార్టీ నేతలు చేసే అవినీతిని, అక్రమాలను ఎందుకు విస్మరిస్తున్నారని సోరెన్ నిలదీశారు.

తమ రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేయాల్సిన అవసరం లేదని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అన్నారు. కాగా, 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్ రాష్ట్రంలో నవంబర్ 13న తొలి విడత, నవంబర్ 20న రెండో విడత పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+