ప్రీ సమ్మర్ సేల్: రూ.599కే స్పైస్‌జెట్ ప్రయాణం
న్యూఢిల్లీ: ప్రయాణికుల కోసం ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ భారీ ఆఫర్లు ప్రకటించింది. స్పైస్‌జెట్ తాజాగా 'ప్రీ సమ్మర్ సేల్'ను ప్రారంభించింది. వేసవి సందర్భంగా ప్రీ సమ్మర్ సేల్ పేరుతో స్పైస్‌జెట్ టికెట్లు రూ.599కే(బేస్ ప్రైస్) అందుబాటులో ఉంచారు.
అయితే ఈ ఆఫర్ కేవలం దేశీయ విమాన సర్వీసులకు మాత్రమే వర్తిస్తుందని స్పైస్‌జెట్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. మంగళవారం నుంచి(23వ తేదీ) ఫిబ్రవరి 25అర్థరాత్రి వరకూ తీసుకున్న ప్రతీ టికెట్‌పై ఈ ఆఫర్ వర్తిస్తుంది.

ఈ సమయంలో బుక్ చేసుకున్న టికెట్లతో ఈ యేడాది మార్చి 1వ తేదీ నుంచి ఏప్రిల్ 13 వరకు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు. స్పైస్‌జెట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శిల్పా భాటియా మాట్లాడుతూ... తాము ప్రవేశపెట్టిన ప్రీ సమ్మర్ సేల్ విమాన ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
ఈ ఆఫర్ ద్వారా ఓవైపు డబ్బు ఆదాతో పాటు మరోవైపు రద్దీని కూడా తప్పించుకోవచ్చని అన్నారు. ఆఫర్‌ను పొందాలనుకునేవారు త్వరపడాలని సూచించారు. స్పైస్‌జెట్ ఎయిర్ లైన్స్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు.












Click it and Unblock the Notifications