"నా భార్యను మాజీ ప్రియుడు కిడ్నాప్ చేశాడు"

బెంగళూరు: తన భార్యను ఆమె మాజీ ప్రియుడు కిడ్నాప్ చేశాడని ఓ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్యను రక్షించాలని అతను పోలీసులకు మనవి చేశాడు. బెంగళూరు నగరంలోని సదాశివనగర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బెంగళూరు నగరంలోని ఎంఎస్ పాళ్యలో థామస్, నందిని దంపతులు నివాసం ఉంటున్నారు. నందిని లింగరాజపురంలోని ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. ఈనెల 14వ తేదిన నందిని ఉద్యోగానికి వెళ్లింది.

Husband claimed that My wife is kidnapped by her ex-lover

తరువాత నందిని తిరిగి ఇంటికి రాలేదని, అదే రోజు సాయంత్రం శివాజీనగర నుంచి ఇంటికి బయలుదేరిన నందినిని ఆమె మాజీ ప్రియుడు కిడ్నాప్ చేశాడని థామస్ సదాశివనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సదాశివనగర పోలీసులు కేసు నమోదు చేశారు. నందిని మొబైల్ నెంబర్, ఆమె మాజీ ప్రియుడి మొబైల్ నెంబర్ నెట్ వర్క్ ట్రేస్ చేస్తున్నామని, త్వరలోనే ఇద్దరినీ పట్టుకుంటామని గురువారం పోలీసులు తెలిపారు. అదే విధంగా థామస్ మీద పోలీసులు నిఘా వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+