Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

liquor husband: ఏమే వాడెవడు, వీడెవడు ? ఫోన్లో ఎవరు ?, భార్య తల కొబ్బరిబొండం నరికినట్లు నరికి !

చెన్నై7 కన్యాకుమారి: ఏమే వాడెవడు ?, వీడెవడు ? ఫోన్లో ఎవరు ? అంటూ భార్యను భర్త టార్చర్ పెట్టాడు. అర్దరాత్రి బెడ్ రూమ్ లో భార్య గాఢంగా నిద్రపోతున్న సమయంలో భర్త ఎంట్రీ ఇచ్చాడు. చప్పుడు చెయ్యకుండా భార్య దగ్గరకు వెళ్లిన భర్త కొబ్బరిబొండాలు కత్తిరించి పదునైన కొడవలి తీసుకున్నాడు. నిద్రపోతున్న భార్య మెడ కొబ్బరిబొండం నరికినట్లు నరికేశాడు. నేరుగా మరో గదిలోకి వెళ్లిన భర్త నైలాన్ తాడు తీసుకుని ఉరి వేసుకున్నాడు. మెడ తెగిపోవడంతో గిలగిలా కొట్టుకున్న భార్య సమీపంలోని కొన్ని వస్తువులను కాలితో తన్నడంతో చప్పుడు అయ్యింది. పక్కగదిలో నిద్రపోతున్న కూతురు, కొడుకు నిద్రలేచి చూడగా అప్పటికే తల్లిదండ్రుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని గుర్తించి కేకలు వేశారు.

 లాక్ డౌన్ ముందు హ్యాపి

లాక్ డౌన్ ముందు హ్యాపి

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కురుందగోడు ఉన్నందుళం ప్రాంతంలో రాజశేఖర్ (42), తంగం (38) దంపతులు నివాసం ఉంటున్నారు. 14 ఏళ్ల క్రితం రాజశేఖర్, తంగంల వివాహం జరిగింది. రాజశేఖర్, తంగం దంపతులకు రాహుల్ (12) అనే కుమారుడు, తనూషి (11) అనే కుమార్తె ఉన్నారు. రాజశేఖర్ కొంబరిబొండాల వ్యాపారం చేస్తున్నాడు. తంగం జీడిపప్పు తయారు చేసి విక్రయించే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది.

 తాగుబోతు అంటే తక్కువే

తాగుబోతు అంటే తక్కువే

రాజశేఖర్ చేతిలో నిత్యం డబ్బులు గలగలాడేవి. మద్యంకు బానిస అయిన రాజశేఖర్ ఉదయం నుంచి రాత్రి వరకు ఫుల్ టైట్ గా కిక్కులో ఉంటాడు. భర్త రాజశేఖర్ ను తాగుబోతు, వీరతాగుబోతు అనడం కంటే చెప్పడానికి వేరే కొత్తపదం వెతుక్కోవలసి వస్తుంది. రాత్రి ఫుల్ గా మద్యం సేవించి ఇంటికి వెళ్లే రాజశేఖర్ భార్య తంగంతో గొడవ పెట్టుకుని కిక్కు తగ్గిపోయిన తరువాత నిద్రలోకి జారుకునేవాడు.

 లాక్ డౌన్ దెబ్బతో కాసులు మాయం

లాక్ డౌన్ దెబ్బతో కాసులు మాయం

కరోనా వైరస్ వ్యాపించడానికి ముందు వరకు రాజశేఖర్ జోబులు ఎప్పుడు కాసులతో (డబ్బులు) గలగలాడేవి. కరోనా వైరస్, లాక్ డౌన్ దెబ్బతో వ్యాపారం ఢీలాపడటంతో రాజశేఖర్ జోబులు కొంచెంకొంచెం ఖాళీ అవుతూ వచ్చాయి. తరువాత మద్యం సేవించడానికి డబ్బులు లేక రాజశేఖర్ ఇబ్బందులు పడ్డాడు.

 రెచ్చిపోయిన రాజశేఖర్

రెచ్చిపోయిన రాజశేఖర్

భర్త రాజశేఖర్ ఇంటి ఖర్చులకు డబ్బులు ఇవ్వకపోవడంతో భార్య తంగం కుటుంబ పోషణకు ఇబ్బందులు ఎదుర్కొనింది. ఆ సమయంలో ఇంటిలో గొడవలు మొదలైనాయి. లాక్ డౌన్ దెబ్బతో తంగం ఉద్యోగం ఊడిపోయింది. మద్యం సేవించడానికి డబ్బులు ఇవ్వని భార్య తంగం మీద రాజశేఖర్ అతని ప్రతాపం చూపించడం మొదలుపెట్టాడు.

 ఏమే వాడెవడు ? వీడెవుడు ఫోన్ లో ఎవరు

ఏమే వాడెవడు ? వీడెవుడు ఫోన్ లో ఎవరు

కుటుంబ పోషణ కోసం భార్య తంగం జీడిపప్పు తయారు చేసి విక్రయించే కంపెనీలో ఉద్యోగంలో చేరింది. అంతకాలం సైలెంట్ గా ఉన్న రాజశేఖర్ రెచ్చిపోయాడు. ఏమే నువ్వు ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నావ్ ? నిన్న నువ్వు మాట్లాడిన వాడు ఎవడు, ఈ రోజు నువ్వు మాట్లాడిన వాడు ఎవడు ? అంటూ భార్య తంగం మీద శివాలెత్తడం మొదలుపెట్టాడు. నువ్వు ఉద్యోగానికి వెళ్లి పరాయి మగాళ్లతో కలుకుతున్నావా ? అంటూ భార్య తంగం మీద అనుమానం పెంచుకున్నాడు. అప్పటి నుంచి ఇంట్లో రాజశేఖర్, తంగం దంపతుల మధ్య గొడవలు మరింతపెరిగిపోయాయి.

 రాత్రి సైలెంట్ గా వచ్చిన భర్త

రాత్రి సైలెంట్ గా వచ్చిన భర్త

ఉద్యోగానికి వెళ్లిన తంగం సాయంత్రం ఇంటికి వెళ్లింది. ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలతో కలిసి మాట్లాడుకుంటున్న సమయంలో రాజశేఖర్ పీకలదాక మద్యం సేవించి పిల్లిలాగా సైలెంట్ గా ఇంటికి వెళ్లాడు. తరువాత భార్య తంగంతో పాటు ఇద్దరు పిల్లలతో గొడవ పెట్టుకున్న రాజశేఖర్ కు మద్యం మత్తు నషాలానికి ఎక్కడంతో హాల్ లోనే నిద్రపోయాడు. తంగం ఆమె ఇద్దరు పిల్లలు భోజనం చేసి వేరేవేరు గదుల్లో నిద్రపోయారు.

 భార్య తల నరికిన భర్త

భార్య తల నరికిన భర్త

అర్దరాత్రి నిద్రలేచిన రాజశేఖర్ భార్య ఏం చేస్తోంది ? అని గమనించాడు. వెంటనే కొబ్బరిబొండాలు కత్తిరించే పదునైన కొడవలి తీసుకుని భార్య తంగం నిద్రపోతున్న గదిలోకి వెళ్లాడు. నిద్రపోతున్న భార్య తంగం నడుంమీద కొర్చుని ఆమె కదలకుండా చేసి కొబ్బరిబొండాలు కత్తిరించే కొడవలి తీసుకుని భార్య మొడనరికేశాడు. తరువాత మరో గదిలోకి వెళ్లిన రాజశేఖర్ నైలాన్ తాడు తీసుకుని ఉరి వేసుకున్నాడు.

 అనుమానంతో హత్య, భయంతో ఆత్మహత్య

అనుమానంతో హత్య, భయంతో ఆత్మహత్య

ప్రాణం పోయే సమమంలో తంగం తనకలాడటంతో కాళ్లు తగిలి కొన్ని వస్తువులు కిదపడటంతో చప్పుడు అయ్యింది. ఇద్దరు పిల్లలు వెళ్లి చూడగా తల తెగి రక్తపుమడుగులో తల్లి కొట్టుమిట్టాడుతున్న తల్లిని చూసి కేకలు వేశారు. చట్టుపక్కల వాళ్లు వచ్చి చూడగా అప్పగికే తంగం ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పక్క గదిలో రాజశేఖర్ సైతం తాడుకు వేలాడుతూ శవమై కనిపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+