వివాహేతర సంబంధం: స్నేహితుడిని చంపి, ముక్కలుగా ఫ్రిజ్‌లో...

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: తన భార్యతో వివాహేతర సంబంధం ఉందని భావించిన ఓ వ్యక్తి తన స్నేహితుడిని అత్యంత కిరాతకంగా చంపాడు. అంతేకాదు శవాన్ని ముక్కలు ముక్కలుగా కోసి ఫ్రిజ్‌లో పెట్టి పారిపోయాడు.ఈ ఘటన ఢిల్లీలో సంచలనం సృష్టించింది.

గత వారం నగరం దక్షిణ ప్రాంతంలోని సయిద్‌ ఉల్‌ అజయిబ్‌ ప్రాంతంలో సంచలనం రేపిన హత్య ఉదంతం మిస్టరీని పోలీసులు చేధించారు. ఓ వ్యక్తిని ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌లో దాచిపెట్టిన కేసులో అంతా అనుమానించినట్లుగానే స్నేహితుడే హంతకుడిగా తేల్చారు.

Husband Kills Friend after Suspecting Affair with Wife

పరారీలో ఉన్న అతనిని ఒడిశాలో పట్టుకున్నట్లు దక్షిణ ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. విచారణలో ముందు పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు యత్నించినప్పటికీ.. తర్వాత నిజం ఒప్పుకున్నట్లు పోలీసులు చెప్పారు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతోనే స్నేహితుడు విపిన్‌ జోషిని దారుణంగా హత మార్చినట్లు బాదల్ అంగీకరించాడు. దీంతో అతన్ని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

గార్డెన్‌ ఆఫ్ పైవ్‌ సెన్సెస్‌ ప్రాంతంలో ఎఫ్‌ఐవో కంట్రీ చికెన్‌ అండ్ బార్‌లో ప్రాణ స్నేహితులైన విపిన్‌ జోషి, బాదల్‌ మండల్‌లు పని చేసే వారు. అయితే తన భార్యతో చనువుగా ఉండటం.. తాను లేని సమయంలో కూడా విపిన్‌ తరచూ తన ఇంటికి వెళ్తుండటం బాదల్‌ గమనించాడు.

దీంతో తన భార్యతో వ్యవహారం నడుపుతున్న స్నేహితుడిని మట్టుపెట్టేందుకు ప్రణాళిక వేసుకున్నాడు. అక్టోబర్ 9న తాను అద్దెకు ఉంటున్న గదిలో దావత్ ఇస్తానంటూ విపిన్‌ను ఆహ్వనించాడు.

ఆపై చిత్తుగా తాగిన విపిన్‌ను అప్పటికే తెచ్చిపెట్టుకున్న మాంసం కత్తితో పొడిచి చంపేశాడు. ఆపై బాత్‌రూమ్‌లోకి లాక్కెల్లి శవాన్ని ముక్కలుగా నరికాడు. వాటిని ఫ్రిడ్జిలో దాచి.. ఏమీ ఎరుగనట్లు కోల్‌కతా పారిపోయాడు. అక్కడి నుంచి ఒడిశాలోని రూర్కెలాలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి తలదాచుకోగా.. వారిచ్చిన సమాచారంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తీసుకొచ్చారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The man who brutally murdered his friend and then chopped up his body before stuffing it in his refrigerator told the police that he committed the crime because he suspected something ‘suspicious’ between his wife and the victim.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి