చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Wife: మాట్లాడితే బయటకు చెక్కేస్తున్న భార్య, చేతిపారతో చెక్కేసిన భర్త, శవం ఒంటరిగా ఉంది తెచ్చుకోండి !

|
Google Oneindia TeluguNews

కాన్పూర్/ లక్నో/చెన్నై: కుటుంబ సభ్యులు చూపించిన యువకుడిని వివాహం చేసుకుని సంతోంగా జీవించాల్సిన భార్య ఆమె భర్త చేతిలోనే దారుణ హత్యకు గురైయ్యింది. వివాహం జరిగిన తరువాత భార్య అత్తారింటిలో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు పుట్టింటికి పరిగెత్తుకుంటూ వెళ్లింది. భార్య పదేపదే పుట్టింటికి పరిగెత్తుకుని వెళ్లడం ఆమె భర్తకు ఏమాత్రం నచ్చలేదు. భార్యను ఇంట్లోని బెడ్ రూమ్ లోకి పిలుచుకుని వెళ్లిన భర్త నువ్వు పదేపదే పుట్టింటి చుట్టూ తిరుగుతుంటే చూసే వాళ్లు ఏమనుకుంటారని, నువ్వు పద్దతి మార్చుకోవాలని బుద్దిమాటలు చెప్పాడు.

భర్త ఎంత చెప్పినా భార్య మాత్రం పుట్టింటికి పరుగు తీసింది. పుట్టింటి దగ్గర నా భార్య ఏదో చేస్తోందని భర్తకు అనుమానం పెరిగిపోయింది. ఇదే విషయంలో దంపతుల మద్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. పెద్దలు పంచాయితీలు చేసినా భార్య తీరుమాత్రం మారలేదు. ఇక లాభం లేదని డిసైడ్ అయిన భర్త అతని భార్యను చేతిపారతో చెక్కేసి అతి దారుణంగా హత్య చేశాడు. భార్య శవాన్ని ఇంట్లో పెట్టి తాళం వేసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లిన భర్త నా భార్య శవం ఇంట్లో ఉంది, మీరు వెళ్లి ప్యాక్ చేసి తెచ్చుకోండి అంటూ అక్కడ కుర్చీలో కుర్చుని దర్జాగా చెప్పడం కలకలం రేపింది. భార్య కుటుంబ సభ్యులు వేరే రకంగా భర్త మీద కేసు పెట్టడంతో కథ రసవత్తరంగా మారింది.

Illegal affair: ఒకే కంపెనీలో దంపతుల ఉద్యోగం, భార్యతో క్యాబిన్ లో కాపురం పెట్టిన మేనేజర్, ఫినిష్ !Illegal affair: ఒకే కంపెనీలో దంపతుల ఉద్యోగం, భార్యతో క్యాబిన్ లో కాపురం పెట్టిన మేనేజర్, ఫినిష్ !

 ఇంట్లో చేసిన పెళ్లి

ఇంట్లో చేసిన పెళ్లి

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లోని భోగ్నిపూర్ ప్రాంతంలో రామ్ కుమార్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రామ్ కుమార్ వెండర్ గా పని చేస్తున్నాడు. భోగ్నిపూర్ సమీపంలో నివాసం ఉంటున్న ఉమా (23) అనే యువతిని రామ్ కుమార్ కు ఇచ్చి వివాహం చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు నిర్ణయించారు. పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికి రామ్ కుమార్, ఉమా దంపతుల వివాహం జరిగింది.

 మాట్లాడితే పుట్టింటికి చెక్కేస్తున్న భార్య

మాట్లాడితే పుట్టింటికి చెక్కేస్తున్న భార్య

వివాహం జరిగిన తరువాత ఉమా అత్తారింటిలో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు పుట్టింటికి పరిగెత్తుకుంటూ వెళ్లింది. భార్య ఉమా పదేపదే పుట్టింటికి పరిగెత్తుకుని వెళ్లడం ఆమె భర్త రామ్ కుమార్ కు ఏమాత్రం నచ్చలేదు. భార్య ఉమాను ఇంట్లోని బెడ్ రూమ్ లోకి పిలుచుకుని వెళ్లిన భర్త రామ్ కుమార్ నువ్వు పదేపదే పుట్టింటి చుట్టూ తిరుగుతుంటే చూసే వాళ్లు ఏమనుకుంటారని, నువ్వు పద్దతి మార్చుకోవాలని బుద్దిమాటలు చెబుతూ వచ్చాడు.

 నా భార్యకు పుట్టింటిలో ఏం పని ?

నా భార్యకు పుట్టింటిలో ఏం పని ?

వెండర్ గా పని చేస్తున్న భర్త రామ్ కుమార్ ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. భర్త రామ్ కుమార్ ఎంత చెప్పినా భార్య ఉమా మాత్రం పుట్టింటికి పరుగు తీస్తూనే ఉంది. పుట్టింటి దగ్గర నా భార్య ఉమా ఏదో చేస్తోంది ? అంటూ ఆమె భర్త రామ్ కుమార్ కు అనుమానం పెరిగిపోయింది. పుట్టింటి దగ్గర నా భార్య ఉమాకు ఎవరైనా ప్రియుడు ఉన్నాడా ? అంటూ అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయంలో రామ్ కుమార్, ఉమా దంపతుల మద్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. పెద్దలు పంచాయితీలు చేసినా భార్య ఉమా తీరుమాత్రం మారలేదు.

 చేతిపారతో భార్యను చెక్కేసిన భర్త

చేతిపారతో భార్యను చెక్కేసిన భర్త

భార్య ఉమా పుట్టింటికి వెళ్లే విషయంలో రామ్ కుమార్ ఎక్కువగా గొడవ పడుతున్నాడు. ఆ సమయంలో ఉమా ఇటుక రాయి తీసుకుని భర్త రామ్ కుమార్ మీద దాడి చేసింది. భార్య ఉమా దాడి చెయ్యడంతో భర్త రామ్ కుమార్ ఇంకా రగిలిపోయాడు. నా మాటకే ఎదురు చెబుతావా ?, పుట్టింటిలో ఏం పెట్టావే అంటూ భార్య ఉమాను చితకబాదేశాడు. ఆ సమయంలో ఉమా కూడా రెచ్చిపోయింది. ఇక లాభం లేదని డిసైడ్ అయిన భర్త రామ్ కుమార్ ఇంటిలో ఉన్న చేతిపార తీసుకుని అతని భార్య ఉమాను చెక్కేసి అతి దారుణంగా హత్య చేశాడు.

 శవం ఒంటరిగా ఉంది ప్యాక్ చేసి తెచ్చుకోండి

శవం ఒంటరిగా ఉంది ప్యాక్ చేసి తెచ్చుకోండి

భార్య ఉమా శవాన్ని ఇంట్లోని బెడ్ రూమ్ లోకి లాక్కొనివెళ్లి అక్కడ పెట్టి బయట తాళం వేసిన రామ్ కుమార్ నేరుగా భోగ్నిపూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. నా భార్య ఉమా శవం ఇంట్లో ఒంటరిగా ఉంది, మీరు వెళ్లి ప్యాక్ చేసి తెచ్చుకోండి అంటూ రామ్ కుమార్ పోలీస్ స్టేషన్ లోని కుర్చీలో కుర్చుని దర్జాగా చెప్పడం కలకలం రేపింది.

 కేసు పెట్టిన భార్య తండ్రి

కేసు పెట్టిన భార్య తండ్రి

భార్య ఉమా కుటుంబ సభ్యులు వేరే రకంగా భర్త రామ్ కుమార్ మీద కేసు పెట్టారు. వరకట్నం తీసుకురావాలని తమ కుమార్తె ఉమాను నిత్యం టార్చర్ పెడుతున్నాడని, కట్నం తీసుకురాలేదని ఆమెను చంపేశాడని ఉమా తండ్రి చంద్రపాల్ కేసు పెట్టాడని బోగ్నిపూర్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ ప్రభాత్ కుమార్ మీడియాకు చెప్పారు.

 పుట్టింటిలో ఏదో జరుగుతోందని ?

పుట్టింటిలో ఏదో జరుగుతోందని ?

రామ్ కుమార్ తో పాటు అతని తల్లిదండ్రులు, ఆడపడుచు కలిసి ఉమాను హత్య చేశారని చంద్రపాల్ కేసు పెట్టడంతో కథ మలుపు తిరిగింది. తాను ఒక్కడే ఉమాను హత్య చేశానని ఆమె భర్త రామ్ కుమార్ అంగీకరించాడని, అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపించామని భోగ్నీపూర్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ ప్రభాత్ కుమార్ స్థానిక మీడియాకు చెప్పారు. పదేపదే పుట్టింటికి వెళ్లి ఎంజాయ్ చేస్తున్న ఉమాను ఆమె భర్త చేతిపారతో చెక్కేసి చంపడం ఉత్తరప్రదేశ్ లో కలకలం రేపింది.

English summary
Young Wife: Husband kills wife with a Spade and then tells police to pick her body in Kanpur in Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X