లైంగిక సుఖం ఇవ్వలేని భర్త: ప్రియుడికి చెప్పి చంపించిన భార్య, కనపడేదని డ్రామా, చివరికి !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: భర్త లైంగిక సుఖం ఇవ్వలేదని ప్రియుడితో కలిసి అతన్ని హత్య చేయించిన మహిళను బెంగళూరులోని రాజగోపాలనగర పోలీసులు అరెస్టు చేశారు. నీలా, ఆమె ప్రియుడు ప్రదీప్, అతని స్నేహితులు రంజిత్, హరి ప్రసాద్ అనే నలుగురిని అరెస్టు చేశామని సోమవారం పోలీసులు చెప్పారు.

నీలా, మధుసూదన్ (36) దంపతులు. మధుసూదన్ ప్రతి రోజూ తనకు లైంగిక సుఖం ఇవ్వడం లేదని నీలా ఆవేదన చెందింది. ఇదే సమయంలో నీలా ప్రదీప్ తో అక్రమ సంబంధం పెట్టుకునింది. ప్రతి నిత్యం ప్రదీప్ ఇంటికి వచ్చి వెలుతుంటే మధుసూదన్ కు అనుమానం వచ్చింది.

Husband Murdered By Wife 4 Arrested in Bengaluru

నీ పద్దతి మార్చుకోవాలని నీలాను ఆమె భర్త మధుసూదన్ హెచ్చరించాడు. ఎలాగైనా నా భర్తను చంపేయాలని నీలా ఆమె ప్రియుడికి చెప్పింది. అక్టోబర్ 12వ తేదీన రాత్రి మధుసూదన్ ను క్యాంటర్ వాహనం లో ఎక్కించుకున్న ప్రదీప్ డాక్టర్ రాజ్ కుమార్ సమాధి సమీపంలోకి వెళ్లాడు.

అక్కడ స్నేహితులు రంజిత్, హరిప్రసాద్ ను క్యాంటర్ వాహనంలో ఎక్కించుకున్నాడు. మార్గం మధ్యలు మధుసూదన్ కు పీలకదాక మద్యం తాగించి ముగ్గురు కలిసి అతన్ని గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం నీలాకు ఫోన్ చేసిన ప్రదీప్ నీ భర్తను అంతం చేశామని, ధైర్యంగా ఉండాలని చెప్పాడు. మధుసూదన్ మృతదేహాన్ని డ్రైనేజ్ దగ్గర విసిరేసి వెళ్లారు.

మూడు రోజుల తరువాత నీలా రాజగోపాలనగర పోలీస్ స్టేషన్ చేరుకుని తన భర్త కనపడటం లేదని ఫిర్యాదు చేసింది. పోలీసులకు అనుమానం వచ్చి నీలా మీద నిఘా వేశారు. నాలుగు రోజుల తరువాత మధుసూదన్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

భర్త లేడని ఆందోళన ఏమాత్రం లేని నీలా తన ప్రియుడు ప్రదీప్ తో కలిసి తిరిగింది. పోలీసులకు అనుమానం వచ్చి ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యగా అసలు విషయం అంగీకరించడంతో అందర్నీ అరెస్టు చేశామని రాజగోపాలనగర పోలీసులు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Husband Murdered By Wife 4 Arrested in Bengaluru in Karnataka.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి