నా భార్య ఎవరితోనో లేచిపోయింది: అనుమానంతో చంపేసి

జైపూర్: భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానంతో ఆమెను దారుణంగా హత్య చేసి ఊరికి దూరంగా ఆమెను పాతిపెట్టాడు. తరువాత తన భార్య ఎవరితోనో వెళ్లిపోయిందని నమ్మించిన వ్యక్తిని రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు.

రాజస్టాన్ లోని జాంజును జిల్లా, నావల్ ఘడ్ పట్టణంలో ప్రదీప్ (27), నిర్మలాదేవి (22) దంపతులు నివాసం ఉంటున్నారు. నిర్మలాదేవి ప్రవర్తనపై ప్రదీప్ అనుమానం పెంచుకున్నాడు. బయటకు వెళ్లినట్లు నటిస్తూ దూరంగా ఉంటూ భార్య ఏం చేస్తుందని పరిశీలించేవాడు.

నిర్మలాదేవి ప్రవర్తనపై ప్రదీప్ రోజురోజుకు అనుమానం పెంచుకున్నాడు. చివరికి ఆమెను చంపేస్తే ఓపని అయిపోంతుంది అనుకున్నాడు. ఇటీవల ఇంటిలోనే నిర్మలాదేవితో గొడవపడ్డాడు. తరువాత ఆమెను దారుణంగా చంపేశాడు.

Husband murders wife suspecting her character in Rajasthan

ఎవ్వరికి అనుమానం రాకుండా ఊరికి 25 కిలోమీటర్ల దూరంలోని నిర్జనప్రదేశంలో నిర్మలాదేవి మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. తరువాత నాభార్య ఎవరితోనో లేచిపోయిందని అందరిని నమ్మించాడు.

నా కుమార్తె కనపడటం లేదని నిర్మలాదేవి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ప్రదీప్ మీద అనుమానం రావడంతో అతనిని అదుపులోకి తీసుకుని విచారించారు. చివరికి నేరం చేసినట్లు ప్రదీప్ అంగీకరించాడు. నిర్మలాదేవి మృతదేహాన్ని పూడ్చి పెట్టిన ప్రాంతం గుర్తించిన పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టుంకు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+