రూ.600 కోట్లు దానం: కలియుగ కర్ణుడు గోపాల్ రెడ్డి

బెంగళూరు: మా వంశస్తులు పది కాలాలపాటు కూర్చుని తినడానికి రూ.వందల కోట్లు సంపాదించాలి అనుకునే వారిని మనం చూశాం. ప్రభుత్వాలని మోసం చేసి పన్ను ఎగ్గొట్టి బ్లాక్ మనీ దాచుకున్న వారిని మనం చూశాం. అయితే దేవుడిని నమ్ముకున్న భక్తులకు, పేదలకు మఠం అందిస్తున్న సేవలు గుర్తించిన ఒక వ్యాపారవేత్త ఏకంగా రూ.600 కోట్లు దానం చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధానిలోని జూబ్లీహిల్స్ లో నివాసం ఉంటున్న సతి గోపాల రెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఎం.గోపాల రెడ్డి కర్ణాటకలోని ఉడిపి పేజావర మఠంకు రూ.600 కోట్లు విరాళం ఇచ్చారు. బెంగళూరులో పేజావరమఠాధిపతి శ్రీ విశ్వతీర్థ స్వామీజీ, ఎం.గోపాల్ రెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

స్వామీజీ మాట్లాడుతూ.. పేజావర మఠం కుల మతబేదాలు లేకుండ పేదలకు సేవ చేస్తున్నదని అన్నారు. ఈ సేవలు ఇంకా విస్తరించడానికి సమయం వచ్చిందని చెప్పారు.
గంగానదిని శుభ్రం చేయించడానికి ప్రధాని మోడీ తగిన చర్యలు తీసుకొవాలని విజ్ఞప్తి చేశారు. పేదల భూములు లాక్కోవడం మంచిది కాదని అన్నారు.

Hyderabad based businessman donated whopping Rupees 600 crores

సతి గోపాల్ రెడ్డి ట్రస్ట్ వ్యవస్థాపకుడు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం నగదు లండన్ లో ఉందని, ఆ నగదు భారత్ కరెన్సీలోకి మార్చడానికి కొన్ని నియమాలు ఉన్నాయన్నారు. నగదు విదేశాలలో ఉన్నందున సమాజ సేవ చెయ్యడానికి కొంత అడ్డంకి అయ్యిందన్నారు. 15 రోజులలో నగదు భారత్ తీసుకు వచ్చి పేజావర మఠంకు అందిస్తామని అన్నారు.

మూడు సంవత్సరాల క్రితం సతి గోపాల్ రెడ్డి ఫౌండేషన్ స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని గోపాల్ రెడ్డి తెలిపారు. తన తండ్రి ప్రభుత్వ ఉద్యోగం చేసే వారని, తరువాత ఉద్యోగం వదిలి పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని అన్నారు. తాను షేర్ మార్కెట్ వ్యాపారం చేశానని గోపాల్ రెడ్డి అన్నారు.

మా తండ్రి, నేను సంపాదించిన సోమ్ము ఉడిపి దేవాలయంకు చెందిన పేజావర మఠంకు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని గోపాల్ రెడ్డి వివరించారు. తాను శ్రీ కృష్ణుడి పరమ భక్తుడు అని గోపాల్ రెడ్డి తెలిపారు. తాను మఠంకు అందిస్తున్న రూ.600 కోట్లు బ్లాక్ మని కాదని గోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. గోపాల్ రెడ్డి ప్రస్తుతం బెంగళూరులో స్థిరపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+