300 అడుగుల లోయలో శవమై కనిపించిన ఇన్పోసిస్ లేడీ టెక్కి , ఏం జరిగిందంటే?

పూణే: ఉల్లాసంగా సాటి స్నేహితులు, సాటి ఉద్యోగులతో కలిసి ట్రెక్కింగ్ వెళ్లిన లేడీ టెక్కి చివరికి 300 అడుగుల కొండ లోయలో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది. తెలంగాణలోని హైదారాబాద్ కు చెందిన అలిజా రాణా (23) అనే యువతి అనుమానాస్పద స్థితిలో మరణించిందని పూణే సమీపంలోని లూనావాలా పోలీసులు తెలిపారు.

హైదరాబాద్ కు చెందిన అలిజా రాణా పూణేలోని హింజేవాడి ఐటీ పార్క్ లోని ఇన్పోసిస్ లో సాఫ్టేవేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నది. అలిజా రాణా 32 మందితో కలిసి సెప్టెంబర్ 12వ తేదీ లోనావాలా లయన్స్ పాయింట్ దగ్గరకు చేరుకుంది. ఆ రోజు అందరితో కలిసి అలిజా రాణా ఒక్కసారిగా కనపడకుండాపోయింది.

Hyderabad based Pune IT company techie found dead in lonavala valley

శివదుర్గ మిత్ర ట్రెక్కింగ్ గ్రూప్ కు చెందిన 35 మంది ట్రక్కర్ల సహాయంతో లయన్స్ పాయింట్ నుంచి అలిజా రాణా కోసం గాలించారు. కొంత దూరంలో అలిజా రాణా బ్యాగ్ ను సాటి ట్రక్కర్లు గుర్తించారు. విపరీతమైన వానలు, మంచు కారణంగా సహాయక చర్యలకు అంతరాయం ఎర్పడింది.

చివరికి 90 గంటల తరువాత రాహుల్ దేశ్ ముఖ్, ప్రణయ్ అంబోరె అనే ఇద్దరు యువకులకు తాళ్లు కట్టి వాకీటాకీ సహాయంతో 300 అడుగుల లోయలోకి వారిని దింపారు. ఆ లోయలో గాలించగా అలిజా రాణా శవమై కనిపించింది. మూడు గంటలకు పైగా శ్రమించి అలిజా రాణా మృతదేహం కొండ పైకి తీసుకువచ్చారు.

మొదట పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. తరువాత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అలిజా రాణా కాలుజారి కొండ మీద నుంచి లోయలోకి పడిపోయిందా ? ఆత్మహత్య ఏమైనా చేసుకుందా ? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అలిజా కుటుంబ సభ్యులు, ఆమె స్నేహితులు తెలిపిన వివరాల ఆధారంగా కేసు విచారణ చేస్తున్నామని లోనావాలా పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+