హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొత్త కోవిడ్ -19 హాట్‌స్పాట్‌గా హైదరాబాదు... ఆ నగరాల్లో తెలుగువారి పరిస్థితేంటి..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరోనావైరస్ ఎక్కువగా పట్టణప్రాంతాలపైనే పంజా విసురుతోంది. పట్టణాల్లో జనాభా ఎక్కువగా ఉండటం, జనసాంద్రత ఎక్కువగా ఉండటంతో ఈ మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దేశంలో 9 అతిపెద్ద నగరాలు అంటే 5 మిలియన్ జనాభా ఉన్న నగరాల్లో బెంగళూరు, హైదరాబాదు మరియు పూణే నగరాలు కరోనావైరస్ హాట్‌స్పాట్స్‌గా తయారయ్యాయి. ఈ మూడు నగరాల్లో కేసులు రోజురోజుకూ పెరిగిపోతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. అంతకుముందు ముంబై ,ఢిల్లీ , చెన్నై నగరాలు ఉండగా ఇప్పుడు ఈ నగరాలను బెంగళూరు, హైదరాబాదు, పూణే నగరాలు మించిపోయేలా ఉన్నాయి.

గత నాలుగు వారాల్లో బెంగళూరు నగరంలో రోజుకు 12.9శాతం మేరా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.అంతేకాదు మరణాల రేటు కూడా 8.9శాతం మేరా పెరిగింది. ఇక 100 కేసుల్లో మరణాల రేటు చూస్తే అహ్మదాబాదులో ఎక్కువగా మరణాలు నమోదవుతుండగా.. ఆ తర్వాత ముంబై కోల్‌కతాలు ఉన్నాయి. ఇక చెన్నై నగరంలో మిలియన్ జనాభాకు 8,595 కేసులు రికార్డ్ అవుతున్నాయి. ఆ తర్వాత వరసగా ముంబై, పూణే, ఢిల్లీ నగరాలు ఉన్నాయి. ప్రతి మిలియన్ జనాభాకు అత్యధిక మరణాలు ముంబైలో చోటుచేసుకున్నాయి. అక్కడ మిలియన్ జనాభాకు 345 మరణాలు సంభవించాయి.

Hyderabad,Bengaluruand Pune turns hotspots as there is surge is Covid-19 positive cases

ప్రస్తుతం ఉన్న సమాచారంను విశ్లేషించగా.. గత నాలుగు వారాల్లో కరోనావైరస్ క్రమంగా ఇప్పుడున్న నగరాలు రాష్ట్రాలు కాకుండా కొత్త ప్రాంతాలకు వ్యాపిస్తోంది. ముంబైలో రోజువారి సగలు కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.కానీ పూణేలో మాత్రం పెరుగుతున్నాయి. అహ్మదాబాదులో కూడా కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే సూరత్‌లో మాత్రం కేసుల పెరుగుదల జాతీయ సగటుకంటే ఎక్కువగా ఉండటం విశేషం. చెన్నై నగరంలో కేసుల సంఖ్య తగ్గిపోగా అదే హైదరాబాదు బెంగళూరు నగరాల్లో కేసులు పెరిగిపోతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఇక మెగా నగరాల్లో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నాయి. ఉదాహరణకు దేశంలోనే అత్యధిక కేసులు నమోదైన ముంబై నగరంలో ఇప్పుడు పరిస్థితి అదుపులో ఉంది.అయితే థానే, కళ్యాణ్, నవీముంబై, భివాండీల్లో మాత్రం కేసుల సంఖ్య పెరుగుతున్నాయి.

Recommended Video

Kharif Cultivation కి కరోనా దెబ్బ, రైతన్నలకు అదనపు భారం- కూలీల రేట్లు పెరగడంతో Farmers ఆవేదన...!!

ఇదిలా ఉంటే అధిక కేసులు నమోదైన ముంబై నగరంలో పరిస్థితి అదుపులో ఉండగా హైదరాబాదు, బెంగళూరు పూణే నగరాల్లో మాత్రం కేసులు పెరుగుదల అధికంగా కనిపిస్తున్నాయి. ఈ మూడు నగరాలు కరోనావైరస్ కేసులకు హాట్‌స్పాట్‌గా తయారవుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

English summary
With surge in cases Bengaluru Pune and Hyderabad cities are turning out to be hotspot for covid-19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X