CWC meeting: తొలి రోజు పలు కీలక అంశాలపై చర్చించిన సీడబ్ల్యూసీ, జమిలికి వ్యతిరేకం
హైదరాబాద్: నగరంలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) తొలి రోజు సమావేశం ముగిసింది. దేశంలోని తాజా రాజకీయ పరిణామాలు, తెలంగాణలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు, జమిలి ఎన్నికలు లాంటి అంశాలపై కీలకంగా చర్చించారు. వీటితోపాటు మణిపూర్ అల్లర్లు, చైనాతో సరిహద్దు సమస్య, ఇండియా కూటమిలో సీట్ల పంపిణీపై తొలిరోజు సమావేశాల్లో నేతలు చర్చించినట్లు సమాచారం.
కాగా, జమిలి ఎన్నికలను సీడబ్ల్యూసీ వ్యతిరేకించింది. త్వరలో జరిగే రాష్ట్రాల ఎన్నికలపై రెండో రోజైన ఆదివారంనాటి సమావేశంలో చర్చించనున్నారు. సీడబ్ల్యూసీ సమావేశంలో సందర్భంగా అంశాలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు చిదంబరం, జైరాం రమేష్, పవన్ ఖేడా మీడియాకు వివరించారు. ఒకే దేశం.. ఒకే ఎన్నికలు(one nation one election) అనేది రాజ్యాంగం, సమాఖ్య నిర్మాణంపై దాడేనని చిదంబరం అన్నారు.

జమిలి ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ఒకే దేశం.. ఒకే ఎన్నికలకు కనీసం ఐదు రాజ్యాంగ సవరణలు అవసరమన్నారు చిదంబరం. చట్టసభల్లో ఈ రాజ్యాంగ సవరణలను ఆమోదించేంత బలం బీజేపీకి లేదని ఆ పార్టీకి తెలుసన్నారు. అయినప్పటికీ దేశ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు తప్పుడు కథనాలను సృష్టించేందుకు దీన్ని ముందుకు తెస్తోందని చిదంబరం విమర్శించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో దేశ పరిస్థితులపై చర్చిస్తున్నట్లు తెలిపారు.
ప్రత్యక్ష ప్రసారం: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ బ్రీఫింగ్, 📍హైదరాబాద్, తెలంగాణ.https://t.co/J8Wb7Eet8R
— Telangana Congress (@INCTelangana) September 16, 2023
రాజకీయ పరిస్థితులు, ఆర్థిక సంక్షోభాలు, దేశానికి పెను సవాళ్లు విసురుతున్న భద్రతాపరమైన సమస్యలపై చర్చించినట్లు చిదంబరం తెలిపారు. అయితే, సనాతన ధర్మం అంశంపై ఎలాంటి చర్చా జరగలేదన్నారు. ఈ అంశంపై ఎలాంటి వివాదాల జోలికి వెళ్లేందుకు సిద్ధంగా లేమని ఖర్గే ఇప్పటికే చెప్పామన్నారు. రాహుల్ గాంధీ రెండో విడత భారత్ జోడో యాత్ర అంశంపై పరిశీలనలో ఉందన్నారు.
Sharing opening remarks at the historic Congress Working Committee Meeting at Hyderabad.
— Mallikarjun Kharge (@kharge) September 16, 2023
• I extend you all a very warm welcome to this First Meeting of the newly constituted CWC in this brimming city of Hyderabad.
• Indian National Congress has been playing a pivotal role… pic.twitter.com/rSIJ7hQ2Ho
ప్రతిపక్ష రాష్ట్రాలకు సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదని విమర్శించారు చిదంబరం. జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌ను సందర్శించేందుకు ప్రధాని మోడీకి సమయం లేనట్లు కనిపిస్తోందని చిదంబరం ఎద్దేవా చేశారు. చైనాతో సరిహద్దు వివాదంపైనా స్పందించడం లేదన్నారు.
कांग्रेस कार्यसमिति की बैठक
— Congress (@INCIndia) September 16, 2023
📍 हैदराबाद, तेलंगाना pic.twitter.com/7IfcXGIXOd
మూడు అంశాలపై తీర్మానాలు
సీడబ్ల్యూసీ సమావేశంలో మూడు తీర్మానాలు చేసినట్లు జైరాం రమేష్ తెలిపారు. ఈ తీర్మానాలు సంతాపానికి సంబంధించినవేనని చెప్పారు. ఇటీవల కన్నుమూసిన మాజీ సీఎం ఊమెన్ చాందీతోపాటు మణిపూర్ హింసాకాండ, హిమాచల్‌ప్రదేశ్ విపత్తులో మృతి చెందిన పౌరులకు సంతాపం ప్రకటించినట్లు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలతో సంభవించిన విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశామన్నారు.
కాగా, హైదరాబాద్ వేదికగా జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) సమావేశాల్లో భాగంగా ఖర్గే ప్రారంభోపన్యాసం చేశారు. అణగారిన వర్గాలకు విద్య, వైద్యం, ఉపాధి, ఆహార భద్రతను పదిలపరిచేందుకు కుల గణనతోపాటు జనాభా లెక్కల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని మల్లిఖార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు.
హైదరాబాద్ వేదికగా జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలందరూ హాజరయ్యారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా ఇతర నేతలకు రాష్ట్ర నాయకత్వం స్వాగతం పలికింది. కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ భగేల్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్, పార్టీ సీనియర్ నేతలు వీరప్ప మొయిలీ, కేసీ వేణుగోపాల్ తదితరులు సమావేశాల్లో పాల్గొన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications