ఇప్పుడే ఇలా ఉంది.. ఇక ‘ఆ ఆయుధం’ అందుబాటులోకి వస్తే.. ప్రపంచం ఫినిష్!

భవిష్యత్తులో యుద్ధగతినే మార్చే ఆయుధాలు.. హైపర్‌సానిక్‌ మిస్సైల్స్‌. సాధారణ క్షిపణులకన్నా..

న్యూఢిల్లీ : యుద్ధ సమయంలో ఉపయోగించే ఆయుధాలంటే ఇప్పటివరకూ ఖండాంతర క్షిపణులు, అణుబాంబులు, హైడ్రోజన్‌ బాంబులు.. ఇవీ మనకు తెలిసినవి. కానీ తాజాగా మరో రకం మిస్సైల్స్ ఆవిష్కరణ, పరీక్షలు జరుగుతున్నాయి.

అవే హైపర్‌సానిక్‌ మిస్సైల్స్‌. యుద్ధగతినే మార్చే ఆయుధాలివి. సాధారణ క్షిపణులకన్నా.. 5 రెట్లు వేగంగా.. కచ్చితత్వంతో దూసుకెళ్లే వీటి కోసం ఇప్పుడు అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా, చైనాలు పోటీ పడుతున్నాయి.

ఈ హైపర్‌సానిక్‌ క్షిపణులను రడార్ల వ్యవస్థ కూడా పసిగట్టలేదు. అందువల్ల వ్యూహాత్మక యుద్ధం చేసేందుకు ఆయా దేశాలకు అవకాశం ఉంటుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానం మంచిదేకానీ.. ఏ మాత్రం పొరపాటు జరిగినా ఊహలకు అందని వినాశనం చోటుచేసుకుంటుంది.

Hypersonic missiles being developed by US, Russia and China could spark war, experts warn

ఈ హైపర్‌సానిక్‌ క్షిపణుల రూపకల్పన పూర్తయితే యుద్ధరంగ స్వరూపమే పూర్తిగా మారిపోతుంది. ప్రస్తుతం ఈ మిస్సైల్స్‌ రూపకల్పనలో అమెరికా, రష్యా, చైనాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. చైనా ఈ దిశగా ముందడుగు వేస్తే భారత్‌ లాంటి దేశాలకు ప్రమాదమే.

ఈ ఆయుధాలు అగ్రదేశాల చేతిలో ఉన్నంత వరకూ ప్రపంచానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని.. అయితే పొరపాటున అవి ఉగ్రవాద దేశాల చేతిలో పడితే మాత్రం ప్రపంచం సర్వనాశనం అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+