నా టైం అయిపోయింది, నన్ను పంపించేస్తారు: నాడు భార్యకు మెసేజ్ పెట్టిన సైరస్ మిస్త్రీ

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: గత ఏడాది అక్టోబర్ 24న టాటా సన్స్ చైర్మన్‌గా మార్చి 2017 వరకూ బాధ్యతలు నిర్వహించాల్సిన సైరస్ మిస్త్రీని బోర్డు ప్రత్యేక సమావేశం నిర్వహించి తొలగించింది.

ఉద్యోగులకు టాటా లేఖ, సైరస్ మిస్త్రీని ఎందుకు తప్పించారంటే..!

అప్పుడు జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని మిస్త్రీ టీమ్‌లో గ్రూప్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్న నిర్మాల్య కుమార్ తన బ్లాగులో వెల్లడించారు.

‘I am being sacked’, Cyrus Mistry texted wife ahead of meeting

అదే రోజు మిస్త్రీతో పాటు ఉద్వాసనకు గురైన నిర్మాల్య కుమార్, తన పోస్టులో మిస్త్రీని అన్యాయంగా, ఘోరంగా తొలగించారని, కాస్తంత గౌరవంగా తొలగించే మార్గమున్నా, దానిని పాటించలేదన్నారు.

ఇక ఆనాడు బోర్డు సమావేశం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఉండగా మిస్త్రీకి అప్పటికే విషయం తెలిసిపోయిందని, తనను బయటకు పంపడం ఖాయమని, ఈ విషయంలో తాను చేసేది ఏం లేదని తెలుసుకున్న ఆయన, విషయాన్ని భార్యకు టెక్ట్స్ మెజేజ్ రూపంలో తెలిపారన్నారు.

తన సమయం ముగిసిందని, కాసేపట్లో బయటకు పంపించనున్నారని మిస్త్రీ తన భార్యకు చెప్పినట్టు కుమార్ వెల్లడించారు. 148 సంవత్సరాల టాటా గ్రూప్ చరిత్రలో కేవలం ఆరుగురు చైర్మన్లు మాత్రమే ఉన్నారని, ఎవరినీ మిస్త్రీలా తొలగించలేదన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
"I am being sacked," texted Cyrus Mistry to wife Rohiqa on October 24, 2016, minutes after he was informed that he was going to be fired at the Tata Sons board meeting that he was about to attend at 2pm.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి