యూ టర్న్: ఎందుకలా అంటానని సాక్షి ట్విస్ట్
న్యూఢిల్లీ: ప్రభుత్వాన్ని కూల్చే సత్తా తనకు ఉందని సంచలన వ్యాఖ్యలు చేసిన బిజెపి పార్లమెంటు సభ్యుడు సాక్షి మహరాజ్ మాట మార్చారు. ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసలతో ముంచెత్తారు. సమ్మిళిత అభివృద్ధి రాజకీయాలను మోడీ నడిపిస్తున్నారని ఆయన అన్నారు. మోడీని దైవశక్తిగా అభివర్ణించారు.
తన వివాదాస్పద వ్యాఖ్యలకు షోకాజ్ నోటీసును అందుకున్న సాక్షి మహరాజ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో మోడీ ఒక చేత్తో అభివృద్ధి ఎజెండాను, మరో చేత్తో హిందూత్వ ఎజెండాను ముందుకు తీసుకుని వెళ్లాలని ఆయన అన్నటువంటి విషయం తెలసిందే. తాను తలుచుకుంటే ప్రభుత్వాన్ని కూల్చగలనని కూడా అన్నారు.

బుధవారంనాడు ఆయన కొత్త పాట వినిపించారు. ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించినందున అయోధ్యలో రామాలయ నిర్మాణానికి వేచి చూడవచ్చునని అన్నారు. అయోధ్యలో మోడీతో పాటు ప్రతి ఒక్కరూ రామాలయాన్ని నిర్మించాలని కోరుకుంటున్నారని ఇంతకు ముందు అన్నారు.
ప్రభుత్వాన్ని తాను హెచ్చరించినట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. తన మాటలను మీడియా వక్రీకరించిందని అంటూ తాను మోడీ సైనికుడినని, అభిమానిని అని చెప్పుకున్నారు. అటువంటప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలననీ, కూల్చగలనని తాను ఎలా అంటానని ప్రశ్నించారు. మూర్ఖుడు కూడా అలా మాట్లాడబోరని అన్నారు. మోడీ భారత దేశం దైవ శక్తి అని, మోడీ సామాన్యమానవుడు కారని, దైవశక్తి అని అన్నారు.












Click it and Unblock the Notifications