అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై తేల్చేసిన సుదీప్- రాసలీలల వీడియోపైనా క్లారిటీ
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. అధికార భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్).. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నాయి. బీజేపీ తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షిస్తోన్నారు.
ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గేకు ఇది సొంత రాష్ట్రం. ఫలితంగా ఈ ఎన్నికలను అటు కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మంగా తీసుకుంది. ఇప్పటివరకు వెలువడిన ఒపీనియన్ పోల్స్ కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి. ఈ పరిణామాల మధ్య బీజేపీ తన వ్యూహాన్ని మార్చింది. శాండల్‌వుడ్ సూపర్ స్టార్లపై కన్నేసింది. టాప్ హీరో కిచ్చ సుదీప్, దర్శన్ తూగుదీపను పార్టీలోకి చేర్చుకోనుంది. ఈ మధ్యాహ్నం సుదీప్ బీజేపీలో చేరనున్నారు.

ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సమక్షంలో సుదీప్- కాషాయ కండువాను కప్పుకోనున్నారు. వారిద్దరూ కూడా బీజేపీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతోన్నానంటూ వచ్చిన వార్తలను సుదీప్ సుదీప్ తోసిపుచ్చారు. తాను ఎన్నికల బరిలో నిల్చోవట్లేదని స్పష్టం చేశారు. బీజేపీలో చేరడంపైనా క్లారిటీ ఇచ్చారు. బీజేపీ తరఫున తాను ప్రచారం మాత్రమే చేయనున్నట్లు తేల్చి చెప్పారు.
ఇంటి వద్ద తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. ఏదైనా ఓ రాజకీయ పార్టీలో చేరినంత మాత్రాన ఎన్నికల్లో పోటీ చేయాలనే రూలేమీ లేదు కదా? తేల్చి చెప్పారు. తన మేనేజర్ జాక్ మంజునాథ్‌కు టికెట్ ఇవ్వాలంటూ బీజేపీతో సహా ఏ పార్టీని కూడా అడగలేదని స్పష్టం చేశారు. జాక్ మంజుకు కూడా పోటీ చేయలనే ఆసక్తి లేదని వ్యాఖ్యానించారు. తనకు బెదిరింపు లేఖ అందిన విషయాన్ని సుదీప్ ధృవీకరించారు.
రాసలీలలతో కూడిన ఓ ప్రైవేట్ వీడియో తమ వద్ద ఉందని, బీజేపీలో గనక చేరితే దాన్ని లీక్ చేస్తామంటూ సుదీప్‌ను గుర్తు తెలియని వ్యక్తులు లేఖ రాశారు. ఈ లేఖ రాసిందెవరో తనకు తెలుసని, చిత్ర పరిశ్రమకు చెందిన వారే దీన్ని రాశారని తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడిస్తానని సుదీప్ పేర్కొన్నారు.
వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన నటుడు సుదీప్. రాష్ట్రంలో గల అన్ని ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో సుదీప్‌తో ఎన్నికల ప్రచారం చేయించాలని బీజేపీ భావిస్తోంది. రాయచూర్ రూరల్, మాస్కి, షోరాపూర్, మాన్వి, దేవదుర్గ, కంప్లి, సిరిగుప్ప, బళ్లారి, సండూర్, కుడ్లిగి, చెల్లకెరె, మొలకల్మూర్.. వంటి నియోజకవర్గాల్లో బీజేపీ తరఫున ఎస్టీ సామాజిక వర్గానికే చెందిన సుదీప్ ను ఎన్నికల ప్రచార బరిలో దించడం వల్ల పార్టీ విజయావకాశాలు మెరుగుపడతాయని బీజేపీ భావిస్తోంది.












Click it and Unblock the Notifications