దేవుడు ఆదేశించాడు: రజనీకాంత్ వచ్చేస్తున్నాడు

Posted By:
Subscribe to Oneindia Telugu
  రజినీ రాజకీయ రంగ ప్రవేశం పక్కా..!

  చెన్నై: యుద్ధానికి దిగడానికి ముందు సర్వం సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. తన రాజకీయ రంగ ప్రవేశంపై ఈ నెల 31వ తేదీన ప్రటన చేస్తానని ప్రకటించిన ఆయన అభిమానులను ఉద్దేశించి ఉద్వేగంగానే మాట్లాడారు.

  వచ్చేస్తా, 31న ప్రకటిస్తా: పొలిటికల్ ఎంట్రీపై రజనీకాంత్

  దేవుడి కోరిక మేరకు తాను రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని ఆయన చెప్పారు. తనకు రాజకీయాలు కొత్త కాదని అన్నారు. తన ఇంట్లో జయలలిత కలిసినప్పుడు చాలా మర్యాదగా వ్యవహరించానని చెప్పారు.

   రాజకీయాల్లోకి రావడమే విజయం...

  రాజకీయాల్లోకి రావడమే విజయం...

  తనకు రాజకీయాలు కొత్త కాదంటూనే డైనమిక్స్ తెలుసు కాబట్టి రాజకీయాల్లోకి రావడానికి కొంత వెనకాడినట్లు ఆయన తెలిపారు. రాజకీయాల్లోకి ప్రవేశించడమే విజయం సాధిండమని అన్నారు.

  యుద్ధం వస్తే ఎదుర్కోవాల్సిందే...

  యుద్ధం వస్తే ఎదుర్కోవాల్సిందే...

  యుద్దం వస్తే ఎదుర్కోవాల్సిందేనని రజనీకాంత్ అన్నారు. దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తానని, రేపే తాను రాజకీయాల్లోకి రావచ్చనని మేలో అభిమానులను ఉద్దేశించి అన్నారు. ఇప్పుడు దేవుడు ఆదేశించినట్లు భావించాల్సి ఉంటుంది.

  ఆర్కే నగర్ ఫలితం తర్వాత రజనీకాంత్

  ఆర్కే నగర్ ఫలితం తర్వాత రజనీకాంత్

  ఆర్కే నగర్‌లో టిటివి దినకరన్ విజయం తర్వాత రజనీకాంత్ తన రాజకీయ రంగ ప్రవేశం గురించి మాట్లాడారు. రజనీకాంత్ షో బిజినెస్‌లో ఉన్నారని, ఆయన సో మ్యాన్ కారని డైరెక్టర్ మహేంద్రన్ అన్నారు.

   రాజకీయాల్లో ఖాళీ ఉందని భావించారా..

  రాజకీయాల్లో ఖాళీ ఉందని భావించారా..

  అన్నాడియంకె బలహీనపడిన నేపథ్యంలో తమిళ రాజకీయాల్లో శూన్యత ఏర్పడిందని రజనీకాంత్ భావిస్తున్నట్లున్నారు. అందుకే ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించాలనే నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. తాను ఎప్పుడో అభిమానులను కలవాల్సిందని, ఆలస్యం చేశానని ఆయన అన్నారు.

  సినిమాల్లోకి వస్తానని అనుకోలేదు..

  సినిమాల్లోకి వస్తానని అనుకోలేదు..

  తాను సినిమాల్లోకి వస్తానని అనుకోలేదని, తాను హీరో కావడం తనకే ఆశ్చర్యం కలిగించిందని రజినీకాంత్ అన్నారు. హీరోగా చేయడానికి మొదట భయపడ్డానని, ఎందుకు హీరోగా చేస్తున్నావని కొందరు భయపెట్టారని ఆయన అన్నారు. మొదటి సినిమా హిట్టయ్యాక వారే వచ్చి అభినందించారని అన్నారు. దర్శకుడు మహేంద్రన్‌ తనకు నటనలో మెళకువలు నేర్పారని, తనకు నటనలో మరోస్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి మహేంద్రన్‌ అని అన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  "We need to be prepared well when we go to a battle. We need to fight to win or there's no use of going to a battle," Rajinikanth said.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి