ముందా, వెనకా?: తెలంగాణపై దాటేసిన ప్రధాని

ప్రత్యేక విమానం నుంచి: తెలంగాణపై ప్రధాని మన్మోహన్ సింగ్ సమాధానాన్ని దాటేశారు. తెలంగాణ రాష్ట్రం 2014 ఎన్నికలకు ముందు ఏర్పాటవుతుందా, తర్వాత ఏర్పాటవుతుందా అనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వలేదు.

తెలంగాణ సమస్య సంక్లిష్టమైందేనని ఆయన అన్నారు. తెలంగాణ విషయంలో అనేక సమస్యలున్నాయని తెలుసునని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటు వల్ల ఎదురయ్యే సమస్యలను కేంద్ర మంత్రుల బృదం పరిశీలిస్తోందని, సమస్యలను కేంద్ర మంత్రుల బృందం పరిష్కరిస్తుందని ఆయన అన్నారు.

Manmohan Singh

కోల్ స్కామ్‌పై సిబిఐ విచారణకు రెడీ

తాను చట్టానికి అతీతుడిని కాదని, బొగ్గు కుంభకోణం కేసులో తాను సిబిఐ విచారణకు సిద్దంగా ఉన్నానని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. బొగ్గు కేటాయింపుల్లో ఏ విషయాన్ని కూడా తాను రహస్యంగా ఉంచబోనని ఆయన అన్నట్లు పిటిఐ వార్తా సంస్థ తెలిపింది. బొగ్గు కుంభకోణంలో సిబిఐ తనను కూడా విచారించవచ్చునని ఆయన అన్నారు.

కాల్పుల ఉల్లంఘనపై పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ సమాధానం నిరాశ కలిగించిందని ఆయన అన్నారు. ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ముప్పు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ప్రధాని చెప్పారు.

అసహ్యకరమైన రాజకీయాలను నిరోధించాలని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము తిరిగి అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విద్వేషపూరిత రాజకీయాలకు స్వస్తి చెప్పాలని ఆయన సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+