మోడీ, పళనిసామిని కించపరుస్తూ పోస్టర్లు: టీటీవీ దినకరన్ మీద కేసు: ఏ క్షణంలో అయినా అరెస్టు !
అన్నాడీఎంకే పార్టీ పదవికి, ప్రభుత్వానికి దూరమై నానాతంటాలు పడుతున్న టీటీవీ దినకరన్ కు మరిన్ని చిక్కులు ఎదరైనాయి.
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ పదవికి, ప్రభుత్వానికి దూరమై నానాతంటాలు పడుతున్న టీటీవీ దినకరన్ కు మరిన్ని చిక్కులు ఎదరైనాయి. టీటీవీ దినకరన్ ను ఏ క్షణంలో అయినా అరెస్టు చెయ్యడానికి తమిళనాడు పోలీసులు రంగం సిద్దం చేస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను కించపరుస్తూ పోస్టర్లు వేసి కరపత్రాలు పంచారని పళనిసామి వర్గానికి చెందిన శరవణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీటీవీ దినకరన్ తో సహ మొత్తం 17 మంది మీద సేలం జిల్లా పోలీసులు కేసులు నమోదు చేశారు.
సేలం జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఎస్ కే. సెల్వం, వెంకటాచలంతో సహ 7 మందిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. టీటీవీ దినకరన్ తో సహ అందర్నీ అరెస్టు చెయ్యడానికి సిద్దం అయ్యారు. అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) కర్ణాటక విభాగం ప్రధాన కార్యదర్శి, టీటీవీ దినకరన్ అనుచరుడు పూహళేందితో సహ అందర్నీ అరెస్టు చేసే అవకాశం ఉంది.

తాను ఎలాంటి కేసులకు భయపడనని, అరెస్టు కావడానికి సిద్దంగా ఉన్నానని టీటీవీ దినకరన్ బుధవారం మీడియాకు చెప్పారు. ఎడప్పాడి పళనిసామి మీద తిరుగుబాటు చేసిన వారి మీద తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని టీటీవీ దినకరన్ వర్గంలోని ఎమ్మెల్యేలు తంగ తమిళ్ సెల్వన్, వెట్రివేల్ ఆరోపించారు. మోడీ అండతో ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం రెచ్చిపోతున్నారని టీటీవీ దినకరన్ వర్గీయులు భారీగా పోస్టర్లు వేసి ప్రచారం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications