నేను బతికే ఉన్నా...ఎలాంటి ప్రమాదం జరగలేదు..నమ్మండి
తాను క్షేమంగానే ఉన్నానని పంజాబ్ సింగర్ ఇందీప్ బక్షి తెలిపారు. ప్రమాదంలో తాను మరణించానని వచ్చిన వార్తలతో ఆయన షాక్ కు గురయ్యారు.
న్యూఢిల్లీ:పంజాబ్ ప్రముఖ సింగర్ ఇందీప్ బక్షి రోడ్డు ప్రమాదంలో మరణించాడంటూ వచ్చిన వార్తల పట్ల ఆయన షాకయ్యాడు. నేను బతికే ఉన్నానంటూ ఆయన ప్రకటించాడు.
పంజాబ్ సింగర్ ఇందీప్ బక్షి రోడ్డు ప్రమాదంలో మరణించాడంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వార్త వైరల్ అయింది. దీంతో ఇందీప్ బక్షి కుటుంబసభ్యులు, స్నేహితులు ఆందోళనకు గురయ్యారు.
ఎట్టకేలకు ఈ విషయం ఇందీప్ దృష్టికి వచ్చింది.ఇందీప్ టీమ్ సభ్యుడొకరు అర్థరాత్రి పూట ఆయనకు ఫోన్ చేశాడు. ఈ విషయమై రోడ్డు ప్రమాదం గురించిన వార్తను చెప్పాడు.దీంతో తాను షాకయ్యాయని ఇందీప్ చెప్పారు.

అయితే ప్రమాదానికి గురైన బిఎండబ్ల్యూ కారు తన కారు నెంబర్ కూడ ఒకటే కావడంతో ఈ ప్రమాదంలో తాను కూడ చనిపోయాయని భావించి ఉంటారని ఇందీప్ చెప్పారు.
ఈ విషయం తెలిసి తన తల్లి రోధించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను క్షేమంగానే ఉన్నానని, తన కారుకు ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు.
పంజాబ్ ప్రముఖ సింగర్ ఇందీప్ బక్షి రోడ్డు ప్రమాదంలో మరణించాడంటూ వచ్చిన వార్తల పట్ల ఆయన షాకయ్యాడు. నేను బతికే ఉన్నానంటూ ఆయన ప్రకటించాడు.












Click it and Unblock the Notifications