వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా పని నేను చేస్తా, నా మాటలకు కట్టుబడి ఉన్నా, ఆయనకేం తెలుసు రాష్ట్రంలో ఏం జరుగుతోందో

By Narsimha
|
Google Oneindia TeluguNews

కోల్ కతా :ఆర్మీ మోహరింపు వ్యవహారంపై పశ్చిమబెంగాల్ రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించింది. ఈ ఘటనపై మమత చేపట్టిన నిరసన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అయితే మమత వైఖరిని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా దుయ్యబట్టింది. ఆ రాష్ట్ర గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠీ కూడ పరోక్షంగా మమతపై విమర్శనాస్త్రాలను సంధించారు. అయితే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను తెలుసుకోకుండా గవర్నర్ మాట్లాడుతున్నారని మమత గవర్నర్ వ్యాఖ్యలకు ఘాటుగానే సమాధానమిచ్చారు.

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఆర్మీ మోహరింపు అంశంపై మమత బెనర్జీ కేంద్ర వైఖరిని తీవ్రంగా తప్పుబట్టింది. ఈ ఘటనపై ఆ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ లో నిరసనను తెలిపారు. సభ కార్యకలాపాలకు అడ్డుతగిలారు. రాష్ట్ర సచివాలయంలోనే ముఖ్యమంత్రి మమత బెనర్జీ 30 గంటలపాటు గడిపారు. కేంద్రం వైఖరి పై ఆమె తన నిరసనను వ్యక్తం చేశారు. సచివాలయంలోనే ఉన్నారు. గురువారం రాత్రి నుండి శుక్రవారం రాత్రి వరకు ఆమె సచివాలయంలోనే గడిపారు. సుమారు 30 గంటపాటు ఆమె సచివాలయంలోనే గడిపారు.

ఆర్మీ మోహరింపుపై ఆరోపణలు. ప్రత్యారోపణలు

ఆర్మీ మోహరింపుపై ఆరోపణలు. ప్రత్యారోపణలు


పశ్చిమబెంగాల్ లోని టోల్ గేట్ల వద్ద ఆర్మీ మోహరింపు అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి , కేంద్ర ప్రభుత్వానికి మద్య వాదనలు, ప్రతివాదనలు, సవాళ్ళు, ప్రతిసవాళ్ళ వరకు వెళ్ళింది. తమ రాష్ట్రానికి తెలియకుండానే రాష్ట్రంలో సైన్యాన్ని ఎందుకు మోహరించారని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తీవ్రంగా ఆగ్రహన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని విరుచుకుపడ్డాురు. ఈ అంశంపై పార్లమెంట్ లో కేంద్రాన్ని ఆ పార్టీ ఎంపిలు నిలదీశారు.విపక్షాలు కొన్నిపార్లమెంట్ లో టిఎంసికి మద్దతుగా నిలిచాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ఆరోపణలు సరైనవి కావని తేల్చి చెప్పింది.

 ఆర్మీని అప్రతిష్టపాలు చేయకూడదు

ఆర్మీని అప్రతిష్టపాలు చేయకూడదు


పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని టోల్ గేట్ల వద్ద ఆర్మీ మోహరింపుపై అధికార టిఎంసి చేస్తోన్న ఆరోపణలపై ఎట్టకేలకు ఆర్మీ కూడ స్పందించింది. రాజకీయాల్లోకి ఆర్మీని లాగడం సరైందికాదన్నారు ఆర్మీ అధికారులు. రాష్ట్రాలకు తెలియకుండా రాష్ట్రంలో తాము ఎందుకు మోహరిస్తామని సైనికాధికారులు ప్రకటించారు. అయితే రాష్ట్రం నుండి వచ్చిన వినతి మేరకే తాము టోల్ గేట్ల వద్ద సైన్యాన్ని మోహరించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆర్మీ అధికారులు ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన వినతికి సంబంధించిన లేఖలను కూడ ఈ ప్రకటనతో ఆర్మీ విడుదల చేసింది.

 నా మాటలకు కట్టుబడి ఉన్నా

నా మాటలకు కట్టుబడి ఉన్నా

రాష్ట్రంలో టోల్ గేట్ల వద్ద ఆర్మీ మోహరింపు విషయంలో తన మాటలకు కట్టుబడి ఉన్నట్టు పశ్చిమబెంగాల్ రాష్ట్ర గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠీ చెప్పారు. ఆర్మీ లాంటి భాద్యయుతమైన సంస్థలపై విమర్శలు చేసే ముందు అన్నీ ఆలోచించుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయమై ఆయన ముఖ్యమంత్రి వైఖరిని తప్పుబట్టారు. ఎవరేమైనా అనుకోని తాను మాత్రం తన మాటలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు గవర్నర్. తన విధులను తాను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. భారత సైన్యంపై విమర్శలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. ఆర్మీపై రాజకీయ విమర్శలు చేయడాన్ని ఆయన ఖండించారు. ఈ విషయమై పరోక్షంగా సిఎం మమత వైఖరిని ఆయన తప్పుబట్టారు.

ఆయనకేం తెలుసు

ఆయనకేం తెలుసు

రాష్ట్రంలో ఎనిమిదిరోజులుగా లేని వ్యక్తికి రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతోందో ఎలా తెలుస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠీ పై విరుచుకుపడ్డారు. ఆర్మీని అప్రతిష్టపాలు చేయకూడదని, వారిని రాజకీయాల్లోకి లాగకూడదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆమె ఘాటుగానే స్పందించారు. రాష్ట్రంలో లేకుండా ఏం జరుగుతోందో ఎలా తెలుస్తోందని ఆమెప్రశ్నించారు.ఏ విషయమైనా మాట్లాడేముందుకు అన్నీ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె గవర్నర్ నుద్దేశించి వ్యాఖ్యానించారు. కేంద్రం తరపున గవర్నర్ వకాల్తా పుచ్చుకొన్నారని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలను గవర్నర్ పెద్దగా పట్టించుకోలేదు. తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు.

English summary
iam stick on about army issue in bengal state said west bengal governor kesarinathe tripati. dont wrong allegation on army said governor. but cm mamata condemned governor's statement. he is not in state past 8 days. how can say what is the situation in state asked mamta, but kesarinath said iam stick on my statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X