ఉద్యోగుల్ని పట్టేసిన కేంద్రమంత్రి, శిక్షగా సెలవు(పిక్చర్స్)
న్యూఢిల్లీ: కార్యాలయానికి ఆలస్యంగా వచ్చిన ఉద్యోగులను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఒకరోజు సాధారణ సెలవు పైన ఇంటికి పంపించారు.
ప్రకాశ్ జవదేకర్ ఉదయం తొమ్మిది గంటలకు శాస్త్రి భవన్‌లోని తన శాఖకు సంబంధించిన కార్యాలయానికి వచ్చారు. ఈ సమయంలో ఆయన నేరుగా తన చాంబర్‌కు వెళ్లకుండా గదుల్లో తిరిగి చూశారు.
ఆయన గదుల్లో తిరుగుతున్న సమయంలో కొందరు అప్పుడే వస్తున్నారు. మరికొందరు రాలేదు. దీంతో గం.9.15 నిమిషాల సమయం దాటి వచ్చిన వారిని సాధారణ సెలవు తీసుకోవాల్సిందిగా ప్రకాశ్ జవదేకర్ సూచించారు. ఆలస్యంగా రావొద్దని చెప్పారు.

ప్రకాశ్ జవదేకర్
కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తన శాఖ కార్యాలయంలో తొమ్మిదింపావు లోపు రాని ఉద్యోగులను సాధారణ సెలవు తీసుకోవాలని సూచిస్తూ.. చిన్నపాటి పనిష్మెంట్ విధించారు.

నరేంద్ర మోడీ
ప్రకాశ్ జవదేకర్ చర్య ద్వారా కేంద్రమంత్రివర్గంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. విధులకు ఆలస్యంగా వచ్చారంటూ జవదేకర్ 40 మంది ఉద్యోగులను సెలవు తీసుకోమని ఇంటికి పంపించారు.

ప్రకాశ్ జవదేకర్
ప్రకాశ్ జవదేకర్ సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు శాస్త్రి భవన్లోని సమాచార, ప్రసార శాఖ కార్యాలయంలో తనిఖీ చేశారు. అక్కడ ఆయనకు ఖాళీ పలు కుర్చీలన్నీ కనిపించాయి.

ప్రకాశ్ జవదేకర్
తనకు ఖాళీ కుర్చీలు కనిపించడంతో.. ఆయా స్థానాల్లో కూర్చునే వారిని తన వద్దకు రావాల్సిందిగా ఆయన ఆదేశించారు. వారికి 'సెలవు' పనిష్మెంట్ ఇచ్చారు. ఉద్యోగులు సమయపాలన విషయంలో కచ్చితంగా ఉండాలని ఆయన వారికి చెప్పారు.












Click it and Unblock the Notifications