ఏ పని అసాధ్యం కాదంటూ ఆనంద్ మహీంద్ర సూపర్‌పోస్ట్(వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా ట్బిట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. ఈ వీడియో పలువురి మనసులను కదిలిస్తోంది.

సుమారు రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో పలువురిని ఆలోచించచేస్తోంది.ఈ వీడియో అనేక మందిలో స్పూర్తిని నింపుతోంది. ఏ పనైనా కష్టసాధ్యం కాదని ఈ వీడియోను చూస్తే స్పష్టమౌతోంది. ఈ వీడియోను చూసిన వారు ఉద్వేగానికి లోనుకాకతప్పదని పరిస్థితులు నెలకొన్నాయి.


ప్రపంచంలో ఏ పని కూడ కష్టమైంది కాదని టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఈ వీడియో‌ను పోస్ట్ చేసి కామెంట్ చేశారు. ఇధ్దరు చిన్నారులు పార్కులో జారుడు బల్లపై ఆడుకొంటున్న సమయంలో తీసిన వీడియో ఇది.

అయితే ఓ బాలిక మాత్రం జారుడు బల్లపై నుండి పదేపదే జారుతూ సంతోషంగా గడుపుతోంది.కానీ, రెండు కాళ్ళు, చేతులు లేని మరో చిన్నారి మాత్రం జారుడు బల్లపైకి ఉత్సాహంతో ఎక్కడాన్ని వీడియో తీశారు. ఈ వీడియోను ఎవరో తీశారు. అయితే ఈ వీడియోను ఆనంద్ మహీంద్రాను రీట్వీట్ చేయడంతో వైరల్ అవతుతోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Anand Mahindra Posted a video in social media, This video now viral.At first I couldn't bear to look & then I was left feeling uplifted. I don't think I will ever complain again about any job being too hard..

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X