Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

74 ఏళ్ల నవ యువకుడిని: తీహార్ జైలులో చిదంబరం పుట్టినరోజు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక, హోం శాఖల మాజీ మంత్రి పీ చిదంబరం గురువారం తీహార్ కేంద్ర కారాగారంలో తన 74వ పుట్టినరోజును జరుపుకొంటున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన ఆయన ప్రస్తుతం కొద్దిరోజులుగా తీహార్ జైలులో విచరణను ఎదుర్కొంటున్నారు. ఈ నెల 19వ తేదీ వరకు ఆయన కస్టడీ కొనసాగుతుంది. జన్మదినం సందర్భంగా చిదంబరం కుమారుడు కార్తి చిదంబరం, ఇతర కుటుంబ సభ్యులు ఈ ఉదయం తీహార్ జైలులో ఆయనను కలుసుకున్నారు. దేశ ఆర్థిక స్థితిగతులపై తాను రాసిన రెండు పేజీల లేఖను చిదంబరానికిక అందజేశారు. చిదంబరానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు, కేంద్ర మాజీమంత్రులు జైరామ్ రమేష్, శశిథరూర్ ట్వీట్ల ద్వారా ఆయనకు గ్రీటింగ్స్ చెప్పారు. చిదంబరం ప్రస్తుతం అగ్నిపరీక్ష వంటి కాలాన్ని ఎదుర్కొంటున్నారని, త్వరలోనే దీన్ని అధిగమిస్తారని చెప్పారు.

ఆలోచనలన్నీ ఆర్థిక వ్యవస్థ చుట్టే..

పుట్టినరోజు సందర్భంగా చిదంబరం తరఫున ఆయన కుటుంబ సభ్యులు ఈ ఉదయం వరుసగా ట్వీట్లను సంధించారు. 74 సంవత్సరాల నవ యువకుడిగా మారిపోయానని అన్నారు. అదే ఉత్సాహంతో తాను ఎన్డీఏ ప్రభుత్వం ఆర్థిక విధానాలపై పోరాటం సాగిస్తానని చెప్పారు. పార్టీ నాయకులు, స్నేహితులు, బంధుమిత్రులు తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారని, ప్రతిగా తాను వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్లు చిదంబరం చెప్పారు. వయస్సు రీత్యా 74 సంవత్సరాలు నిండినప్పటికీ..మనస్సు రీత్యా తాను నవ యువకుడిగా ఆలోచిస్తున్నాయని అన్నారు. దేశ ఆర్థిక విధానాల చుట్టే తన ఆలోచనలు తిరుగుతున్నాయని చిదంబరం పేర్కొన్నారు. ఒక్క ఆగస్టులోనే దేశ ఎగుమతుల శాతం -6.05గా నమోదైందని, దీన్నిబట్టి ఆర్థిక వ్యవస్థ ఎలాంటి దారుణ స్థితికి చేరుకుందో తెలుస్తోందని అన్నారు.

I Feel 74 Years Young: P Chidambaram Tweets From Tihar On Birthday

ఈ దేశాన్ని ఆ దేవుడే కాపాడాలి..

ఓ ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల శాతం కనీసం 20 శాతాన్ని చేరుకుంటేనే ఏ దేశమైనా పురోగమిస్తుందని చెప్పారు. దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) ఎనిమిది శాతానికి చేరుకోవాలంటే.. ఎగుమతులు 20 శాతం మేర నమోదు కావాల్సి ఉంటుందని అన్నారు. ఆగస్టులో నమోదైన ఎగుమతుల శాతం మైనస్ లోకి వెళ్లిపోవడం ప్రమాద ఘంటికలను మోగిస్తోందని, ప్రమాదకర సంకేతాలను పంపించిందని చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థికంగా ఇలాంటి స్థితికి జారిపోయిన భారత్ ను ఆ దేవుడే కాపాడాలని అన్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఓ దఫా కస్టడీ ముగిసినప్పటికీ.. దీన్ని పొడిగించాలంటూ సీబీఐ చేసిన విజ్ఞప్తిని ఢిల్లీ న్యాయస్థానం అంగీకరించింది. ఈ నెల 19వ తేదీ వరకు కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలను జారీ చేసింది. విచారణ సందర్భంగా చిదంబరాన్ని తీహార్ జైలులోని ఏడో నంబర్ కారాగార కాంప్లెక్స్ లో ఉంచారు. అక్కడే ఆయన విచారణను ఎదుర్కొంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+