అది నన్ను బాధించింది... కపిల్ సిబల్ ఇంటి వద్ద కాంగ్రెస్ కార్యకర్తల నిరసనపై చిదంబరం...
కాంగ్రెస్‌లో అంతర్గత ప్రక్షాళన,నాయకత్వ మార్పును కోరుతూ జీ-23 సీనియర్లు గతేడాది పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే.అప్పటినుంచి జీ 23 నేతలకు పార్టీ అధిష్ఠానానికి మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. సీనియర్లు చేసిన ప్రతిపాదనలకు అధిష్ఠానం నుంచి ఎటువంటి స్పందన లేకపోగా.... పలువురు నేతలు,కార్యకర్తల నుంచి మాత్రం పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ పార్టీలో నాయకత్వ లోపాన్ని మరోసారి ఎత్తిచూపడంతో రగడ మొదలైంది. ఏకంగా ఆయన ఇంటి వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపేంతవరకూ వెళ్లింది.
ఈ వివాదంపై మరో సీనియర్ నేత చిదంబరం స్పందించారు. కపిల్ సిబల్ ఇంటి వద్ద కాంగ్రెస్ కార్యకర్తల ధర్నా విచారకరమని పేర్కొన్నారు. 'పార్టీ అంతర్గత వేదికల్లోనూ అర్థవంతమైన చర్చలకు ఆస్కారం లేకపోవడాన్ని నేను నిస్సహాయతగా భావిస్తున్నాను.తన సహచరుడు,ఎంపీ కపిల్ సిబల్ ఇంటి వద్ద కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగడం నన్ను బాధించింది.' అని చిదంబరం పేర్కొన్నారు. చిదంబరంతో పాటు సీనియర్లు గులాంనబీ ఆజాద్,ఆనంద్ శర్మ,నట్వర్ సింగ్ తదితరులు కపిల్ సిబల్‌కు మద్దతుగా నిలిచారు.నిరసన చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు.

పంజాబ్‌లో పీసీసీ చీఫ్ పదవికి నవజోత్ సింగ్ సిద్దూ రాజీనామా... మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ అవడం... ఈ పరిణామాల నేపథ్యంలో కపిల్ సిబల్ బుధవారం మీడియా ముందుకు వచ్చారు.'ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులు లేరు.మరి నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు... మాకైతే ఆ విషయం తెలియదు... మేము జీ-23 నేతలమే.. కానీ జీహుజూర్ 23 నేతలం కాదు... సమస్యలు,లోపాలను ప్రశ్నిస్తూనే ఉంటాం.' అని కపిల్ సిబల్ పేర్కొన్నారు.
'పార్టీ నుంచి నేతలు ఎందుకు వెళ్లిపోతున్నారు...? దీనిపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇందుకోసం తక్షణం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని సమావేశపరచాలి.ప్రస్తుతం కాంగ్రెస్ సంక్షోభం ఎదుర్కొంటున్న పంజాబ్ రాష్ట్రం పాకిస్తాన్‌తో సరిహద్దు కలిగిన రాష్ట్రం. అక్కడి పరిణామాలు ఐఎస్ఐ,పాకిస్తాన్‌కు అనుకూలంగా మారే ప్రమాదం ఉంది.పంజాబ్‌లో అతివాదం పెరిగిన చరిత్ర తెలిసిందే. కాబట్టి కాంగ్రెస్ వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి. పార్టీని వీడినవారు తిరిగి కాంగ్రెస్ గూటికి రావాలి. ఈ దేశాన్ని కాపాడేది కాంగ్రెస్ ఒక్కటే...' అని సిబల్ చెప్పుకొచ్చారు.
కపిల్ సిబల్ వ్యాఖ్యలను తప్పు పడుతూ బుధవారం(సెప్టెంబర్ 29) కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఢిల్లీలోని ఆయన ఇంటి వద్ద నిరసనకు దిగారు. కపిల్ సిబల్ కారును ధ్వంసం చేశారు. ఆయన ఇంట్లోకి టమాటాలు విసిరారు.'ఇకనైనా సోయిలోకి రండి... పార్టీని వీడండి...' అంటూ కపిల్ సిబల్‌ను ఉద్దేశించి కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ జిందాబాద్ అంటూ నినదించారు.
సీడబ్ల్యూసీ సమావేశానికి సిద్దమైన కాంగ్రెస్ :
జీ 23 సీనియర్ల ఎఫెక్ట్‌తో కాంగ్రెస్ అధిష్ఠానం ఎట్టకేలకు సీడబ్ల్యూసీ సమావేశానికి సిద్దమైంది. త్వరలోనే సీడబ్ల్యూసీ సమావేశం ఉంటుందని ప్రకటించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ఈ విషయాన్ని వెల్లడించారు. సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ నాయకత్వ మార్పు,ఆయా రాష్ట్రాల్లో పార్టీల పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications