సిగ్గనిపించింది: మాజీ ప్రియుడి వాడియాపై జింతా

గత పదేళ్లుగా వాడియా తనకు తెలుసునని, తమ మధ్య సంబంధం కూడా ఉందని, కొంత కాలం క్రితం తాము తెగదెంపులు చేసుకున్నామని, తాము కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహయజమానులం అయినప్పటికీ వృత్తిపరమైన సంభాషణతోనే సరిపుచ్చేవాళ్లమని ఆమె వివరించారు.
తాము కొంత కాలంగా మాట్లాడుకోవడం లేదని, ఈ మధ్య ఒకటి రెంజు సార్లు తమ మధ్య వాగ్వివాదం జరిగిందని, వాడియా తనను దూషించే ప్రయత్నం చేశాడని, పూర్తి అమర్యాదతో కూడిన భాషను తనపై ప్రయోగించారని ఆయన అన్నారు. సహోద్యోగులు, మిత్రులు, కుటుంబ సభ్యుల ముందు తాను సిగ్గుపడేలా వ్యవహరించాడని ఆమె ఆరోపించారు.
బెంగళూర్ ఐపియల్ మ్యాచ్ సందర్భంగా తన పక్కన కూర్చోవాలని అడిగాడని, తాను వినకపోవడంతో తనపై కఠినంగా, కోపంగా అమర్యాదకరమైన వ్యాఖ్యలు చేశారని ఆమె ఆరోపించారు.












Click it and Unblock the Notifications