• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మోదీపై నాది నిజమైన ప్రేమే .. ఆప్యాయత చూపని వారిది ఇష్టమే కాదు: రాహుల్ సెటైర్లు

|

చెన్నై : ఎన్నికల రణక్షేత్రంలో నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరుతోంది. తాము చేసిన పనులు, చేయబోయే పనులను వివరిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తారు. కానీ మృదువుగా మాట్లాడటం, ఆప్యాయత చూపడం అరుదు. కానీ రాహుల్ గాంధీ .. ఎన్నికల స్ట్రాటజీలో కొత్త పంథాను అనుసరిస్తున్నారు. తన ప్రత్యర్థి ప్రధాని మోదీపై ఎనలేని ప్రేమను ఒలకబోస్తున్నారు.

రాజకీయాల కోసం అభినందన్ ఫోటోలా .. ? బీజేపీ ఎమ్మెల్యేకు తలంటిన ఈసీ.

నాది కల్మషం లేని ప్రేమ

నాది కల్మషం లేని ప్రేమ

రాహుల్ గాంధీ సెటైరిగ్ గా స్పందిస్తున్నారు. బుదవారం చెన్నైలో విద్యార్థులతో మాట్లాడిన ఆయన తనది ప్రధాని మోదీపై నిజమైన ప్రేమని వ్యాఖ్యానించారు. ఎవరైతే ఆప్యాయత చూపించరో వారు ప్రేమించనట్టే లెక్క అని కొత్త భాష్యం ఇచ్చారు. ఒకవేళ మోదీ ప్రేమ పొందలేదంటే ఆయనకు ప్రేమంటే ఏంటో తెలియదని వ్యంగ్యాస్త్రం సంధించారు. మీరు ఎందుకు ప్రధాని మోదీని కౌగిలించుకున్నారని విద్యార్థులు ప్రశ్నిస్తే .. 'ప్రతి మత పునాదుల మీద ప్రేమ నెలకొల్పబడింది, అందుకే నేను మోదీని ఆలింగనం చేసుకున్నా అని‘ సమాధానమిచ్చారు రాహుల్ గాంధీ.

ప్రేమ వర్సెస్ విమర్శ

ప్రేమ వర్సెస్ విమర్శ

ప్రధాని మోదీపై తాను ప్రేమ కురిపిస్తుంటే ఆయన మాత్రం కాంగ్రెస్ పార్టీ, తనపై విమర్శలు గుప్పిస్తున్నారని చెప్పారు రాహుల్. 'నా తండ్రి మంచి వారు కాదా, ఎందుకు అనవసర ఆరోపణలు చేస్తారు. తాను ఈ అందమైన ప్రపంచంలో లేనందుకు నాకు చాలా బాధగా ఉంది. మోదీ చేసినట్టు ఆరోపణలు చేయదలచుకోలేదు. కొంచేమైనా ఆప్యాయత చూపించాలని అనుకుంటున్నానని‘ పేర్కొన్నారు. ప్రధాని మోదీపై తనకు ఎలాంటి కోపం, ద్వేషం, శత్రుత్వం లేదని ఉద్ఘాటించారు.

ఓటమి నేర్పిన పాఠం

ఓటమి నేర్పిన పాఠం

గత ఎన్నికలతో ఎంతో నేర్పించాయన్నారు రాహుల్ గాంధీ. అప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తనకు ఎన్నికలు అంటే ఏంటో పూర్తిగా తెలిసిందని . అయితే ఓడిపోవడం మాత్రం బాధ కలిగించిందన్నారు. ఇప్పటికీ కూడా మోదీ అంటే తనకు ద్వేషం లేదని .. మీరు కూడా ప్రజలను ద్వేషించొద్దని కోరారు. వస్తువులకు ఎవరూ చెప్పరని .. మనుషులకు మాత్రమే చెబుతారని పేర్కొన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
congress president Rahul Gandhi on Wednesday said he has genuine love for Prime Minister Narendra Modi. Some people don’t show affection because they are not loved. He (Modi) didn’t get the love he should have had. I genuinely love the PM, said Rahul Gandhi as he addressed a gathering of students in Chennai. When asked why he hugged PM Modi, Rahul Gandhi said he did it because love is the foundation of every religion. The PM was talking about me, Congress and how we are filthy and how my father was not a good man. He is so angry that he is not able to see the beauty of the world. So I thought at least from my side I should show him some affection, Rahul Gandhi told college students.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more