తమిళనాడు సీఎం రాజీనామా ! తల పట్టుకున్న ఎడప్పాడి పళనిసామి

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి రాజీనామా చేశారని తమిళ మీడియాలో గురువారం మద్యాహ్నం జోరుగా ప్రచారం జరిగింది. ఎడప్పాడి పళనిసామి రాజీనామా చెయ్యడంతోనే ఆయన కారు మీద ఎర్రబుగ్గలు తొలగించారని మీడియా కోడైకూసింది.

అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు గురువారం ఒక్కటి అవుతున్నాయని ప్రచారం జరిగింది. గురువారం ఉదయం నుంచి తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామి తన నివాసంలో నిమిషం తీరకలేకుండా చర్చలు జరిపారు. అన్నీర్ సెల్వం సైతం సీఎం పళనిసామి ఇంటికి వస్తారని ప్రచారం జరగడంతో మీడియా అక్కడే తిష్టవేసింది.

పళనిసామి సమవేశం

పళనిసామి సమవేశం

గురువారం ఉదయం తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి ఇంటిలో సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఎడప్పాడి పళనిసామి వర్గీయులు హడావిడిగా కనిపించారు.

ఏం చెద్దాం అంటూ చర్చలు

ఏం చెద్దాం అంటూ చర్చలు

అన్నాడీఎంకేలోని రెండు వర్గాల విలీనంపైనే ఎడప్పాడి పళనిసామి తన వర్గీయులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. పన్నీర్ సెల్వం వర్గంతో కలిసి ముందుకు వెళ్లాలని ఎడప్పాడి పళనిసామి తన సహచరులతో చర్చించారు.

మంత్రుల హడావిడి

మంత్రుల హడావిడి

తమిళనాడు సీఎం ఇంటిలో పలువురు సీనియర్ మంత్రులు హడావిడిగా కనిపించారు. పన్నీర్ సెల్వం వర్గంతో చేరితో వచ్చే లాభనష్టాలపై చర్చించారు. ఆ సమయంలో పలు ప్రభుత్వ శాఖల అధికారులు ఎడప్పాడి పళనిసామి ఇంటికి చేరుకున్నారు.

పన్నీర్ సెల్వం డిమాండ్లు

పన్నీర్ సెల్వం డిమాండ్లు

తమిళనాడు ముఖ్యమంత్రి పదవి, అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి తనకే కావాలని పట్టుబట్టిన పన్నీర్ సెల్వంను ఎలా బుజ్జగించాలి అంటూ ఎడప్పాడి పళనిసామి తన మంత్రి వర్గంతో చర్చించి అందరి అభిప్రాయాలు సేకరించారు.

బయటకు వచ్చిన ఎడప్పాడి

బయటకు వచ్చిన ఎడప్పాడి

ఇంటిలో సుదీర్ఘంగా సీనియర్ మంత్రులతో చర్చలు జరుపుతున్న ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి ఒక్క సారిగా ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర నిలిపిన ఆయన కారు దగ్గరకు వెళ్లారు. మోనంగా కారు డోర్ తీసి పైకి ఎక్కి ఎర్రబుగ్గలను పట్టుకుని తొలగించారు.

స్వయంగా తొలగించిన సీఎం

స్వయంగా తొలగించిన సీఎం

తన వాహనం మీద ఉన్న ఎర్రబుగ్గలను ఎడప్పాడి పళనిసామి స్వయంగా తొలగిస్తున్న సమయంలో అక్కడే ఉన్న మీడియా సభ్యులు ఫోటోలు, వీడియో క్లిప్పింగ్స్ తీశారు. తమిళనాడు సీఎం పదవి ఆశిస్తున్న పన్నీర్ సెల్వం కోసం ఎడప్పాడి పళనిసామి తన పదవికి త్యాగం చేశారని దక్షిణ భారతదేశంలోని అన్ని బాషల్లో ప్రసిద్ది చెందిన ఓ టీవీ చానల్ మొదటి సారి బ్రేకింగ్ న్యూస్ అంటూ వార్తలు ప్రసారం చేసింది.

తల పట్టుకున్న ఎడప్పాడి

తల పట్టుకున్న ఎడప్పాడి

ఈ విషయం తెలుసుకున్న ఎడప్పాడి పళనిసామి తల పట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎర్రబుగ్గలు తొలగించాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ తానే స్వయంగా తన వాహనం మీద ఎర్రబుగ్గ తొలగించానని తరువాత మీడియాకు చెప్పారు.

లైవ్ లో చూపించారు

లైవ్ లో చూపించారు

ఎడప్పాడి పళనిసామి తన వాహనం మీద ఉన్న ఎర్రబుగ్గను తొలగిస్తున్న క్లిప్పింగ్స్ తమిళ టీవీ చానల్స్ లో లైవ్ లో చూపించారు. పన్నీర్ సెల్వం కోసం తన సీఎం పదవిని త్యాగం చేస్తున్న ఎడప్పాడి పళనిసామి అంటూ ప్రసారం చేశారు. చివరికి సీఎం పళనిసామి క్లారిటీ ఇవ్వడంతో సదరు తమిళ చానల్స్ సిబ్బంది నాలుక కరుచుకున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
I have removed the red beacon from my car, as per Centre's guidelines, says TamilNadu CM Edappadi K. Palaniswami. He himself did that.
Please Wait while comments are loading...