వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్యామ్ పిట్రోడాకు చెబుతా.. అమెరికాలో వంటకాలు చేయండి, తమిళ చెఫ్‌‌లతో రాహుల్ గాంధీ..

|
Google Oneindia TeluguNews

తమిళనాడుకు చెందిన చెఫ్‌లకు రాహుల్ గాంధీ అడగక్కుండానే అభయం ఇచ్చారు. తమిళనాడులో విలేజ్ కుకింగ్ చానల్ పాపులర్ యూ ట్యూబ్ చానెల్.. వీరు రకరకాల ఫుడ్ అందజేస్తుంటారు. యూ ట్యూబ్ చానెల్‌ను రైతులే నిర్వహిస్తారు. అయితే ఇటీవల అక్కడికి వచ్చిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పుట్టగొడుగులు (మష్రూమ్) బిర్యానీ ఆరగించారు. అదీ తిని ఫిదా అయిపోయారు. వారితో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఏంటీ..? మీ గోల్ ఏంటీ అని ముచ్చటించారు.

పుట్టగొడుగుల బిర్యానీ.. అదిరిందీ..

పుట్టగొడుగుల బిర్యానీ.. అదిరిందీ..

పుదుకొట్టై జిల్లా చిన్న వీరమంగళం గ్రామంలో రైతులు ఫుడ్ అందజేస్తున్నారు. యూట్యూబ్ ఛానల్‌కు చాలా మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. ఛానల్ ద్వారా వచ్చే ఆదాయాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. దీంతో రాహుల్‌ గాంధీ వారి దగ్గరకు వెళ్లారు. పుట్టగొడుగుల బిర్యానీ రుచిని రాహుల్ ఆస్వాదించారు. మీ లక్ష్యమేంటి అని రాహుల్ వారిని అడిగారు. విదేశాల్లో తమ వంటలను చేయాలనుకుంటున్నామని వారు తెలిపారు. ఎక్కడ అని రాహుల్ అడగగా.. అమెరికా, మలేషియా, చైనా తదితర దేశాల పేర్లు చెప్పారు.

పిట్రోడాకు చెబుతా..

పిట్రోడాకు చెబుతా..

అమెరికాలో ఎక్కడి అని అడగగా దానిపై స్పష్టత లేదన్నారు. వెంటనే రాహుల్ అమెరికాలో ఉన్న తన స్నేహితుడు శ్యామ్ పిట్రోడాకు చెబుతానని.. అక్కడికి వెళ్లొచ్చని తెలిపారు. దీంతో వారి ఆనందానికి హద్దులు లేవు. దీనికి సంబంధించి 14 నిమిషాల నిడివిగల వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పుట్టగొడుగుల బిర్యానీ రుచి చూడటమేగాక, వంటకం తయారీలో రాహుల్ కూడా ఓ చేయి వేశారు. కరూర్ పట్టణ శివారులో జనవరి 25వ తేదీన షూటింగ్ జరిగింది.

ఇందిరాగాంధీని గుర్తుచేసుకొని..

ఇందిరాగాంధీని గుర్తుచేసుకొని..

తమిళనాడులో మూడు రోజుల పర్యటనలో భాగంగా.. రాహుల్ ఇక్కడికి వచ్చారు. రాహుల్ గాంధీతో కరూర్ కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి ఉన్నారు. రాహుల్ గాంధీ రాకతో విలేజ్ కుకింగ్ చెఫ్స్ మురిసిపోయారు. బృందంలో ఉన్న ఓ పెద్దాయన రాహుల్ నాయనమ్మ ఇందిరా గాంధీని గుర్తుచేసుకొని ఉద్వేగానికి గురయ్యారు. రాహుల్ గాంధీ తమతో ఇట్టే కలిసిపోయారని చెప్పుకొచ్చారు.

English summary
Rahul Gandhi then offers to contact his friend in the US, a long-time associate of the Gandhi family, to see if their dream could be fulfilled.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X