అమెరికా బయల్దేరిన ప్రధాని మోడీ: ఈ టూర్‌తో మరో రికార్డు

న్యూఢిల్లీ: అమెరికా పర్యటనకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ భారత్‌ను యథాతథంగా ప్రపంచానికి ప్రదర్శించనున్నట్లు చెప్పారు. తనను తాను అలాగే ప్రెజెంట్ చేస్తున్నానని అన్నారు. వాల్ స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా, భారతదేశ నాయకుల మధ్య అపూర్వమైన నమ్మకం ఉందని ప్రధాని మోడీ అన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో అమెరికా పర్యటనకు బయల్దేరి వెళ్లారు. బుధవారం నుంచి యూఎస్ అధికారిక పర్యటన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఇండో-అమెరికా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ పర్యటన మంచి అవకాశాన్ని కల్పిస్తుందని తెలిపారు.

 moditour

'అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఇతర యూఎస్ నాయకులతో నా చర్చలు.. ఇరు దేశాల మధ్యద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయి. దీంతోపాటు జీ20, క్వాడ్, ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్ వర్క్ వంటి సదస్సుల్లో ఇరు దేశాల భాగస్వామ్యాన్ని పెంపొందిస్తాయి' అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. న్యూయార్క్‌తో తన అగ్రరాజ్య పర్యటన ప్రారంభించనున్నట్లు తెలిపారు.

జూన్ 21న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ యోగా వేడుకల్లో పాల్గొననున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలన్న భారత ప్రతిపాదనకు ఆమోదం లభించిన చోట ఈ వేడుకల్లో తాను పాల్గొనే అవకాశం రావడం ఆనందంగా ఉందని ప్రధాని మోడీ చెప్పారు. న్యూయార్క్ నుంచి తాను నేరుగా వాషింగ్టన్ వెళ్లనున్నట్లు తెలిపారు.

వాణిజ్యం, సాంకేతికత, సృజనాత్మకత వంటి పలు రంగాల్లో ఇరు దేశాల బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలనుకుంటున్నట్లు ప్రధాని మోడీ వెల్లడించారు. కాగా, వివాదాలను యుద్ధంతో కాకుండా "దౌత్యం, చర్చలతో" పరిష్కరించుకోవాలని, భారతదేశం శాంతి వైపు ఉందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. రక్షణ రంగంలో పరస్పర సహకారం దిశగా ముందడుగు వేసే ప్రణాళికతో ప్రధాని ఈ పర్యటన చేపట్టారు.

కాగా, బైడెన్ తో చర్చల్లో రక్షణ పరిశ్రమల రంగంలో ఉమ్మడిగా రక్షణ ఉత్పత్తుల తయారీ, అభివృద్ధికి రోడ్ మ్యాప్ రూపొందనుంది. అంతేగాక, ఈ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు జో డైడెన్ దంపతుల ఆతిథ్యాన్ని మోడీ స్వీకరించనున్నారు.అంతేగాక, ఈ పర్యటనలో భాగంగా అమెరికా కాంగ్రెస్ ఉభయసభలనుద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు. అమెరికా కాంగ్రెస్‌లో మోడీ ప్రసంగించడం ఇది రెండోసారి. ఈ ఘనత దక్కించుకున్న తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+