డిప్యూటీ సీఎం ఆస్తులు సీజ్ చేసిన ఆదాయ పన్ను శాఖ!
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం భారీ షాకిచ్చింది. లాలూ తనయుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్.. లాలూ తనయ మీసా భారతిల ఆస్తులను ఆదాయ పన్ను శాఖ సీజ్ చేసింది.
పాట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం భారీ షాకిచ్చింది. లాలూ తనయుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్.. లాలూ తనయ మీసా భారతిల ఆస్తులను ఆదాయ పన్ను శాఖ సీజ్ చేసింది.
చదవండి: అక్రమాస్తుల ఆనకొండ! కళ్లుచెదిరే ఆస్తులు, కొనసాగుతున్న ఏసీబీ తనిఖీలు
తేజస్వి, మీసా, ఆమె భర్త శైలేష్ యాదవ్ లకు చెందినవిగా భావిస్తున్న ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ శాఖ అధికారులు సోమవారం రాత్రి ఒక ప్రకటన చేశారు. మరి ఈ పరిణామంపై లాలూ ప్రసాద్ యాదవ్ ఎలా స్పందిస్తారో, ఏమని వ్యాఖ్యానిస్తారో వేచి చూడాల్సి ఉంది.

బినామీ ఆస్తుల వ్యవహారంలో విచారణ సంస్థ ఎదుట హాజరుకావాల్సిందిగా మీసా భారతికి గతంలో రెండుసార్లు సమన్లు జారీ చేశామని, వాటికి ఆమె స్పందించకపోవడంతో దాడులు చేసి ఆస్తులను స్వాధీనం చేసుకున్నామని ఐటీ అధికారులు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications