ఆ వివాదం అలాగే కొనసాగాలనుకున్నా: సల్మాన్ ఖాన్
ముంబై: రియో ఒలింపిక్స్‌కు తనను అంబాసిడర్‌గా నియమించడం వివాదం కావడం, అలాగే కొనసాగాలని తాను అనుకున్నానని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ చెప్పారు. రియో ఒలింపిక్స్‌కు భారత్ తరఫున సుహృద్భావ రాయబారిగా సల్మాన్‌ను నియమించడంపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.
దీనిపై సల్మాన్ ఖాన్ తాజాగా స్పందించటాడు. ఈ వివాదం అలాగే కొనసాగాలని తాను భావించానని, మరింత కాలం అలాగే వివాదం ఉంటే బాగుండేదన్నాడు. ఈ వివాదం ఎక్కువ కాలం కొనసాగితే రియో ఒలింపిక్స్ గురించి అందరూ తెలుసుకుంటారని చెప్పారు.

సచిన్ టెండుల్కర్ క్రికెట్ ఆడతాడని, ఏఆర్ రెహ్మాన్ సంగీతం వాయిస్తాడని, వీళ్లను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించడం పైన ఎలాంటి వివాదం లేదన్నారు. కానీ తనను రాయబారిగా నియమించడంపై వివాదం చేయడం నిరుత్సాహపరిచిందన్నారు.












Click it and Unblock the Notifications