బాబా సియారామ్ అకృత్యాలు: 8 నెలలుగా ప్రతిరోజూ రాత్రి నన్ను... యువతి కన్నీటిగాథ..

ఓ యువతిని చెరబట్టి అత్యాచారం చేసిన కేసులో ఇటీవల అరెస్టయిన బాబా సియా రామ్ దాస్ అకృత్యాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి.

లక్నో: ఓ యువతిని చెరబట్టి అత్యాచారం చేసిన కేసులో ఇటీవల అరెస్టయిన బాబా సియా రామ్ దాస్ అకృత్యాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఈ దొంగబాబా గత ఎనిమిది నెలలుగా తనను నిర్బంధించి ప్రతిరోజూ అత్యాచారం చేసినట్టు బాధితురాలు ఆరోపించింది.

సియారామ్‌ దాస్‌తో పాటు అతడి శిష్యులు కూడా తనపై అనేకమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆమె వెల్లడించింది. బాధితురాలిని ఆమె బంధువులే రూ.50 వేలకు బాబా మహిళా భక్తురాలు ఒకరికి అమ్మేసినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు వెల్లడించారు.

ఆమెను తొలుత లక్నోకి తీసుకెళ్లి, అనంతరం మిశ్రిఖ్‌లోని ఆశ్రమానికి తరలించినట్టు పేర్కొన్నారు. ఆశ్రమంలో అడుగుపెట్టింది మొదలు సియారామ్‌ దాస్ బాధితురాలిని నరకయాతనకు గురిచేసినట్టు వెల్లడైందన్నారు.

అంతేకాదు.. ఆమెను నగ్నంగా సెల్‌ఫోన్లో చిత్రీకరించిన ఆ దుర్మార్గుడు.. ఆశ్రమంలో జరిగిన విషయాలు ఎవరికైనా చెబితే ఆ వీడియోలు బయటపెడతానంటూ బెదిరించినట్టు బాధితురాలు పేర్కొంది.

మిశ్రిఖ్ నుంచి ఆగ్రాలోని మరో ఆశ్రమానికి తీసుకెళ్లారనీ... గత ఎనిమిది నెలలుగా అక్కడే ఉంచుతూ ప్రతిరోజూ రాత్రి తనపై అత్యాచారం చేశారని వెల్లడించింది. తిరిగి ఇటీవల మిశ్రిఖ్ ఆశ్రమానికి వచ్చిన తర్వాత బాబా మరోసారి అఘాయిత్యానికి పాల్పడినట్టు పేర్కొంది.

ఎట్టకేలకు ఆ యువతి ఒకరోజు బాబా సియారామ్ దాస్ ఫోన్ చేజిక్కించుకుంది. వెంటనే ఆశ్రమం నుంచి పోలీసులకు ఫోన్ చేసి తనపై జరుగుతున్న అఘాయిత్యాన్ని వివరించింది. పోలీసులు రంగంలోకి దిగడంతో బాబా సియారామ్ దాస్ కీచకపర్వం బయటి ప్రపంచానికి తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+