వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైల్లో చుక్కలు చూపించారు ...! జైలు లావెట్రీలో కనీసం నీళ్లు కూడ లేవు... ప్రియాంక శర్మ

|
Google Oneindia TeluguNews

మమతా బెనర్జీ ఫోటో మార్ఫింగ్ కేసులో ఐదురోజుల పాటు జైలుశిక్షను అనుభవించి వచ్చిన ప్రియాంక శర్మ మమతా సర్కారుపై పలు ఆరోపణలు చేశారు. ఐదురోజుల పాటు జైలు అధికారులు టార్చర్ పెట్టారని ఆమే నేడు మీడీయా సమావేశంలో చెప్పారు. ఈ సంధర్భంగా జైల్లో తనను ఎంత ఇబ్బంది పెట్టింది వివరించారు. తాను మమత సర్కార్ పై న్యాయపరంగా పోరాడతానని స్పష్టం చేశారు.

అయిదు రోజుల పాటు టార్చర్ పెట్టారు

అయిదు రోజుల పాటు టార్చర్ పెట్టారు

అయిదు రోజులపాటు తనను ఎవరితో జైలు అధికారులు మాట్లాడనీయలేదని చెప్పారు. దీంతోపాటు పాటు జైల్లో కనీస సదుపాయాలు కూడ లేవని ఆమే చెప్పారు. మహిళల టాయిలెట్లలో కనీసం నీళ్లు కూడ లేవని ఆమే తెలిపారు. బయట మనం స్శచ్ఛ భారత్ గురించి మాట్లాడుతున్నామని, మరోవైపు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర్రంలో అలాంటీ పరిస్థితి లేదని ఆమే అన్నారు.

నేనేం తప్పు చేశానో కోర్టులో తేల్చుకుంటాను...

నేనేం తప్పు చేశానో కోర్టులో తేల్చుకుంటాను...

కాగా మమత సర్కారుపై కోర్టులో పోరాడతాని ఆమే తెలిపారు. మార్ఫింగ్ ఫోటోను షేర్ చేసిన తనను మాత్రమే ఎందుకు ఇబ్బందిపెట్టిందో తేల్చుకుంటానని ,ఫోటోను షేర్ చేసిన ఇతరులను మాత్రం ఏమీ చేయలేకపోయిందని ఆమే వాపోయారు. ప్రియాంక శర్మ ఆమే అన్నతో కలిసి నేడు మీడీయాతో మాట్లాడారు. కాగా ప్రియాంక శర్మకు మంగళవారం నాడు కోర్టు బెయిల్ మంజురు చేసింది.

కోర్టు ఆదేశాలను లెక్కచేయని మమత సర్కార్..

కోర్టు ఆదేశాలను లెక్కచేయని మమత సర్కార్..

అయితే కోర్టు ఆదేశాలను సైతం పశ్చిమబెంగాల్ జైలు అధికారులు లెక్కచేయలేదు. సుప్రిం కోర్టు మంగళవారం మధ్యహ్నామే ప్రియాంక శర్మను వదిలిపెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే జైలు అధికారులను మాత్రం బుధవారం ఉదయం 9.40 నిమిషాలకు రిలీజ్ చేశారు. అనంతరం ఆమే మరోసారి కోర్టుకు విన్నవించింది. ఈనేపథ్యంలోనే మమతా సర్కారుకు సుప్రిం కోర్టు చివాట్లు పెట్టింది. తాము వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసిన ఎందుకు మంగళవారం రాత్రి కూడ ప్రియాంక శర్మను ఎందుకు జైలులో చారో సమాధానం చెప్పాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.

ప్రియాంక చోప్రా మార్ఫింగ్ ఫోటోను షేర్ చేసిన ప్రియాంక

ప్రియాంక చోప్రా మార్ఫింగ్ ఫోటోను షేర్ చేసిన ప్రియాంక


కాగా ప్రియాంక శర్మ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముఖాన్ని, నటి ప్రియంకా చోప్రా గత వారం న్యూయార్క్ మెట్ గలా లో జరిగిన ఫ్యాషన్ లో తీసీన ఉన్న ఒరిజన్‌లో ఫోటోతో మార్ఫింగ్ చేసి ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసింది. దీంతో బీజేపీ కార్యకర్తలు ఆమే పై కేసును పెట్టారు. రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు ప్రియాంక శర్మను గత శుక్రవారం ఆమేను ఇంటివద్ద నుండి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అనంతరం ఆమేకు స్థానిక కోర్టు రెండు వారాలపాటు జ్యుడిషియల్ కస్టడి విధించింది. అయితే ప్రియాంక కేవలం బీజేపీ కార్యకర్త కావడంతోనే పోలీసులు ఆమేను అరెస్ట్ చేశారని ప్రియాంకశర్మ తల్లి ఆరోపించింది..ఇది రాజకీయ కుట్రలో భాగంగానే జరిగిందని విమర్శలు చేసింది. దీనిపై బెయిల్ కోసం సోమవారం సుప్రిం కోర్టు వెళ్లడంతో మంగళవారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

English summary
I was tortured in jail. The jailor pushed me. They were very rude inside the jail and the general condition was also quite bad. They didn't let me speak to anyone despite getting bail, didn't let me speak to anyone for five days," Ms Sharma, who walked free this morning after spending five days in jail for posting on West Bengal Chief Minister Mamata Banerjee last week,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X