వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక ప్రభుత్వం పతనం, బీజేపీ హై కమాండ్: బళ్లారి శ్రీరాములు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వం పతనం గురించి ఎక్కడా మాట్లాడకూడని బీజేపీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసిందని, తమ పార్టీ నాయకుడు అమిత్ షా సైతం అనేక సూచనలు సలహాలు ఇచ్చారని, ఇలాంటి సమయంలో తాను సంకీర్ణ ప్రభుత్వం మీద ఎలాంటి వ్యాఖ్యలు చెయ్యలేనని మాజీ మంత్రి, మళకాల్మూరు ఎమ్మెల్యే బళ్లారి, బి శ్రీరాములు అన్నారు. సోమవారం బళ్లారిలో బీజేపీ ఎమ్మెల్యే బి. శ్రీరాములు మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్ కు చాలెంజ్

కాంగ్రెస్ కు చాలెంజ్

కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఆపరేషన్ కమల పేరుతో ఇంటికి పంపిస్తారని జరుగుతున్న ప్రచారంపై శ్రీరాములు మీడియాతో మాట్లాడారు. పార్టీ హై కమాండ్ ఆదేశాల మేరకు ఆపరేషన్ కమలపై నో కామంట్ అని శ్రీరాములు అన్నారు. అయితే బీజేపీ ఎమ్మెల్యేలు మా వైపు ఉన్నారు అంటున్న వారు ఒక్క ఎమ్మెల్యేని వారి వైపు తిప్పుకోని చూపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు శ్రీరాములు సవాలు చేశారు. ఒక్క బీజేపీ ఎమ్మెల్యే కూడా సంకీర్ణ ప్రభుత్వం వైపు చూడటం లేదని శ్రీరాములు మీడియాకు చెప్పారు.

25 ఎంపీ సీట్లు

25 ఎంపీ సీట్లు

ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 25 ఎంపీ సీట్లు కైవసం చేసుకుంది. ఈ సందర్బంలో కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి జోరుగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ నేపద్యంలో ఢిల్లీ హైకమాండ్ బీజేపీ నాయకులు బ్రేక్ లు వేసింది.

అధ్యక్ష పదవి

అధ్యక్ష పదవి

బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి మీద తనకు ఎలాంటి ఆశ లేదరి బళ్లారి శ్రీరాములు అన్నారు. అయితే ఆ పదవి ఇస్తే శక్తి వంచనలేకుండా పని చేస్తానని బళ్లారి శ్రీరాములు ధీమా వ్యక్తం చేశారు. అధ్యక్ష పదవి ఎవ్వరికి ఇవ్వాలి అని హై కమాండ్ నిర్జయం తీసుకుంటుందని, అన్ని పదవుల్లో మార్పులు ఉంటాయని శ్రీరాములు మీడియాకు చెప్పారు.

సీఎం నిర్ణయం

సీఎం నిర్ణయం

సీఎం కుమారస్వామి గ్రామ వాస్తవ్యం విషయంలో మాట్లాడిన శ్రీరాములు ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రామ వాస్తవ్యం లాంటి కార్యక్రమాలతో కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో గ్రాయల్లో ఉన్న సమస్యల గురించి బయటకు వచ్చే అవకాశం ఉందని, అయితే స్థానికులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని శ్రీరాములు చెప్పారు.

కన్నడ భాషకు ప్రధాన్యత

కన్నడ భాషకు ప్రధాన్యత

త్రిభాష సూత్రం విషయంలో మాట్లాడిన బళ్లారి శ్రీరాములు కర్ణాటకలో కన్నడకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. జాతీయ భాషలకు గుర్తింపు ఇస్తూనే కన్నడకు అధిక ప్రధాన్యత ఇవ్వాలని శ్రీరాములు అభిప్రాయం వ్యక్తం చేశారు. కన్నడకు ప్రధాన్యత ఇస్తేనే ఆంగ్లం, హిందీ భాషలకు ప్రధాన్యత ఇచ్చే విషయంలో ప్రజలు నిర్ణయం తీసుకుంటారని శ్రీరాములు అన్నారు. జిందాల్ భూమి విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది కాదని శ్రీరాములు అన్నారు. ఈ విషయంపై మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్పతో చర్చిస్తామని, పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాలని బీజేపీ ఎంపీ దేవంద్రప్పకు సూచించానని శ్రీరాములు వివరించారు.

English summary
As per high command leaders direction i will not speak about Karnataka government collapses said Molakalmuru BJP MLA B.Sriramulu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X