మళ్లీ వస్తా- ఇదే ఎర్రకోట నుంచి ప్రసంగిస్తా: వచ్చే అయిదేళ్లూ మావే: మోదీ ధీమా..!!
న్యూఢిల్లీ: యావత్ దేశం 77వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకొంటోంది. దేశం మొత్తం త్రివర్ణ పతాకాలు రెపరెపలాడుతోంది. నేషన్ ఫస్ట్- ఆల్వేస్ ఫస్ట్.. అనే థీమ్‌తో ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాన్ని వైభవంగా జరుపుకోనున్నారు దేశ ప్రజలందరూ. జాతీయ సమగ్రత, దేశాభివృద్ధికి సంకేతంగా ఈ థీమ్‌ను రూపొందించింది ప్రభుత్వం.
పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ రాజధానిలోని ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేశారు. జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. జనాభా, అతిపెద్ద ప్రజాస్వామ్యం, వైవిధ్యం.. అనే ఈ మూడు అంశాలకు దేశ ప్రజల కలలను సాకారం చేసే శక్తి ఉందని మోదీ చెప్పారు.

ఇది మోదీ ప్రభుత్వం అని, ఆత్మనిర్భర్ భారత్‌కు ప్రతీక అని మోదీ పేర్కొన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడమే కాదు.. దాన్ని అనుకున్న సమయం కంటే ముందే ఛేదించడమూ తమకు తెలుసునని అన్నారు. అలసిపోయే, ఆగిపోయే, ఓడిపోయే భారత్ కాదు.. ఇప్పుడున్నది ఆత్మనిర్భర్ భారత్ అంటూ ప్రధాని భావోద్వేగంతో చెప్పుకొచ్చారు.
విశ్వకర్మల కోసం ప్రధాని మోదీ కొత్త పథకాన్ని ప్రకటించారు. సంప్రదాయ చేతివృత్తుల వారిని ఆదుకోవడానికి, ఆర్థికంగా బలోపేతం చేయడానికి, వారికి మెరుగైన జీవనాన్ని కల్పించడానికి, ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయి మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించడానికి దీన్ని ప్రారంభించబోతోన్నామని అన్నారు.
13,000 నుంచి 15,000 కోట్ల రూపాయలతో వచ్చే నెలలోనే ఈ పథకానికి శ్రీకారం చుట్టబోతోన్నామని ప్రధాని మోదీ చెప్పారు. సెప్టెంబర్ 17వ తేదీన విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలకు ఆర్థిక సాధికారతను కల్పిస్తామని అన్నారు.
వచ్చే ఏడాది ఆగస్టు 15వ తేదీన జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లోనూ తానే ప్రసంగిస్తానంటూ మోదీ ధీమా వ్యక్తం చేశారు. మళ్లీ జాతీయ పతాకాన్ని ఎగురవేస్తానని తేల్చి చెప్పారు. దేశం ఇంకా సుదీర్ఘ ప్రయాణాన్ని సాగించాల్సి ఉందని, ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగడానికి వచ్చే అయిదేళ్ల కాలం అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు.
2014లో ఏర్పడిన తమ ప్రభుత్వ పనితీరును చూసి 2019లో దేశ ప్రజలను తనను మరోసారి ఆశీర్వదించారని, ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని గుర్తు చేశారు. వచ్చే అయిదేళ్లల్లో అద్భుత ప్రగతిని సాధించాల్సి ఉందని పేర్కొన్నారు. 2047 కలను సాకారం చేసుకోవడానికి వచ్చే అయిదేళ్లే అత్యంత కీలకమని, అవి బంగారు క్షణాలని మోదీ చెప్పారు. 2024 ఆగస్టు 15వ తేదీన ఇదే ఎర్రకోట నుంచి దేశ విజయాలు, అభివృద్ధిని మీ ముందు ఉంచుతానని అన్నారు.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications